ETV Bharat / bharat

ఆ రాష్ట్రంలో వెయ్యి చెరువులు మాయం! - ex pwd officials report on tamil nadu lakes

తమిళనాడులో నీటి కుంటలు, చెరువులు, సరస్సులు రానురాను మాయమవుతున్నాయని ప్రజా పనులు విభాగం మాజీ అధికారులు విడుదల చేసిన ఓ నివేదిక తెలిపింది. అధికారుల ఉదాసీనత, ప్రజలు నిర్లక్ష్యం కారణంగా 50ఏళ్లలో సుమారు వెయ్యికి పైగా జల వనరులు కబ్జాకు గురైనట్లు పేర్కొంది.

1000 lakes disappeared from Tamil Nadu map in 50 years-a report
తమిళనాడులో వెయ్యి చెరువులు మాయం
author img

By

Published : Feb 23, 2021, 6:07 PM IST

Updated : Feb 23, 2021, 10:35 PM IST

ఆ రాష్ట్రంలో వెయ్యి చెరువులు మాయం!!

తమిళనాడులో నీటి కుంటలు, చెరువులు కనుమరుగు అవడంపై ప్రజా పనులు విభాగం(పీడబ్ల్యూడీ) మాజీ అధికారుల విడుదల చేసిన నివేదికలో పలు దిగ్భ్రాంతికర అంశాలు వెలుగు చూశాయి. 50ఏళ్లలో సుమారు వెయ్యికి పైగా చెరువులు కనుమరుగైనట్లు అందులో పేర్కొన్నారు. అధికారుల నిర్లక్ష్యం,పెరుగుతోన్న భూ కబ్జాలు, నిర్వహణపై ఆసక్తి లేకపోవడం కారణంగా ఈ పరిస్థితి తలెత్తిందని నివేదికలో వివరించారు.

అప్పట్లో 39 వేలకు పైగా...

50ఏళ్ల క్రితం తమిళనాట 39,202 చెరువులు ఉండేవని ప్రజా పనుల విభాగం మాజీ అధికారులు తెలిపారు. అందులో 15 వేలు పీడబ్ల్యూడీ పరిధిలో ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే... ఇటీవల సుమారు వెయ్యికిపైగా నీటి కుంటలు ఆక్రమణలకు గురై, ఇళ్ల స్థలాలుగా మారినట్ల వెల్లడించారు.

క్షీణించిన నీటి నిల్వలు..

తమిళనాడులోని చాలా ప్రాంతాల్లో నీటి నిల్వలు చాలా వరకు తగ్గిపోయినట్లు మాజీ అధికారుల బృందం తెలిపింది. 50 ఏళ్లకు పూర్వం నీటి నిల్వలు సుమారు 390 టీఎంసీలుగా ఉండేవని పేర్కొంది. కాలక్రమేణా అవి 250 టీఎంసీలకు చేరినట్లు వెల్లడించింది. ప్రస్తుతం పరిస్థితి పూర్తి భిన్నంగా మైనస్​లోకి పడిపోయిందని స్పష్టం చేసింది. ఈ కారణంగా రాష్ట్రంలో రైతులు వ్యవసాయం చేసేందుకు కూడా నీరు దొరకడం లేదని... దీంతో వారి ఆదాయమార్గాలకు గండి పడుతున్నట్లు వివరించింది.

నీటి వాడకం, నిల్వ చేయడంపై ప్రజల్లో, విద్యార్థుల్లో అవగాహన తీసుకురావాలి. తద్వారా చెరువులను, నీటి కుంటలను రక్షించుకోగలం. ప్రజావసరాలకు తగినట్లుగా నీటి వినియోగించుకోగలం.

-కేసీ నీలమేఘం, ఎగ్జిక్యూటివ్​ ప్రెసిడెంట్- వాటర్​ అసోసియేషన్​ తిరుచ్చి

వర్షాకాలంలో 20 టీఎంసీలకు పైగా వృథా...

వర్షాకాలంలో పడిన చినుకులు కాస్తా... సముద్రంలో కలిసిపోతున్నాయి. ఇలా వృథా అయ్యే నీరు సమారు 25 టీఎంసీల వరకు ఉంటుంది. అదనపు నీటిని నిల్వ చేయడానికి రాష్ట్రంలో తగిన వనరులు లేకపోడం ప్రధాన సమస్యగా మారింది. ప్రభుత్వం కూడా వీటిపై ఏటువంటి చర్యలు చేపట్టక పోవడం కారణంగా మద్రాసు ప్రజలు నీటి కోసం ఆధారపడే సెంబరంబాకం, పొండీ, మధురనాథగం, పుజల్​ చెరువు పరిస్థితి అధ్వానంగా మారింది.

మద్రాస్​ ప్రజల నీటి అవసరాలను తీర్చే చెరువుపై ప్రభుత్వాలు ప్రధానంగా దృష్టి సారించాలి. వాటి నిల్వ సామర్థ్యాన్ని పెంచే దిశగా అడుగులు వేయాలి. పూర్వీకులు నీటిని ఆదా చేయడానికి, నిల్వ చేయడానికి వినూత్న మార్గాలను కనిపెట్టారు. వాటినే అధికారులు సరైన పద్ధతిలో అమలు చేస్తే నీటి నిల్వలు పెరుగుతాయి. భూగర్భ జలాలు మెరుగు పడుతాయి.

- ఏ. వీరప్పన్​, పీడబ్ల్యూడీ మాజీ అధికారి

నీటి వనరులను కాపాడుకోవడానికి ప్రభుత్వం కృషిచేస్తోందని పీడబ్ల్యూడీ అధికారి ఒకరు తెలిపారు. ఇందుకుగాను కుడిమరమత్తు పథకం కింద ప్రత్యేక కేటాయింపుల జరిగాయన్నారు. నీటి వనరులను ప్రభుత్వం సమర్థంగా కాపాడుతుందనడంలో సందేహం లేదని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: 118 యుద్ధ ట్యాంకుల కొనుగోలుకు కేంద్రం సిద్ధం

Last Updated : Feb 23, 2021, 10:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.