ETV Bharat / bharat

వైకల్యంపై ఒంటికాలి పోరాటం... పదేళ్ల బాలిక సంకల్పం భేష్! - బాలికకు సోనూసూద్ సాయం

Divyang girl from Jamui: ఒంటికాలితో గెంతుకుంటూ స్కూల్​కు వెళ్తున్న చిన్నారిపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఆమె దీనగాథ విన్న అధికారులు, వితరణశీలులు.. సాయం కోసం ముందుకొస్తున్నారు. తాజాగా సోనూసూద్ సైతం ఆమెకు సాయం చేస్తానంటూ ట్వీట్ చేశారు.

girl going school single leg
ఒంటికాలిపై వెళ్తున్న సీమా
author img

By

Published : May 25, 2022, 5:19 PM IST

Updated : May 25, 2022, 9:36 PM IST

వైకల్యంపై ఒంటికాలి పోరాటం

Bihar single leg girl: తన కల నెరవేర్చుకోవడానికి అంగ వైకల్యాన్ని ఎదిరిస్తోంది పదేళ్ల బాలిక. ఒంటికాలితో గెంతుకుంటూ స్కూల్​కు వెళ్తోంది. బిహార్ జముయీ జిల్లా ఖైరా బ్లాక్​లోని ఫతేపుర్ గ్రామంలో ఉండే సీమాకు రెండేళ్ల క్రితం ఓ ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ ఢీకొట్టడం వల్ల తీవ్రంగా గాయపడింది. దెబ్బతిన్న కాలిని పూర్తిగా తీసేయాలని వైద్యులు.. సీమా కుటుంబ సభ్యులతో చెప్పారు. మరో అవకాశం లేని పరిస్థితుల్లో ఇందుకు అంగీకరించారు.

divyang girl from jamui
తోటి విద్యార్థినులతో సీమా

ఆపరేషన్ పూర్తైన తర్వాత సీమా వేగంగానే కోలుకుంది. దివ్యాంగురాలిననే భావన దరిచేరకుండా సొంతంగా తన పనులు చేసుకోవడం ప్రారంభించింది. క్రమం తప్పకుండా పాఠశాలకు వెళ్లేది. ఎవరికీ భారం కాకూడదని ఒంటికాలితో గెంతుకుంటూనే స్కూల్​కు వెళ్తోంది. ఆమెకు విద్యనేర్పే టీచర్లు సైతం సీమా పట్టుదలను చూసి మెచ్చుకుంటున్నారు.

girl going school single leg
సీమా
girl going school single leg
ఒంటికాలిపై వెళ్తున్న సీమా

తోటి పిల్లలంతా స్కూల్​కు వెళ్లడం చూసి ఒంటికాలి మీదే తానూ వెళ్లేందుకు సిద్ధమైందని సీమా కుటుంబ సభ్యులు చెప్పుకొచ్చారు. ఆమె చదువు కోసం నోట్​బుక్స్ కొనేందుకూ తమ వద్ద తగినన్ని డబ్బులు లేవని పేర్కొన్నారు. ప్రభుత్వాలు తమకు సాయం చేయాలని కోరుతున్నారు.

divyang girl from jamui
సీమా

"సీమా తల్లిదండ్రులు ఇటుకల తయారీ పనికి వెళ్తారు. తన తండ్రికి ఆహారం ఇచ్చేందుకు వెళ్లిన సమయంలో సీమా ట్రాక్టర్ ప్రమాదానికి గురైంది. సీమా చదువుకోవాలని అనుకుంటోంది. మేం కూడా ఆమె మంచిగా చదువుకోవాలనే అనుకుంటున్నాం. మాకు ఎవరి నుంచి ఎలాంటి సాయం అందలేదు. ప్రభుత్వం మాకు సహాయం చేయాలని కోరుతున్నాం.
-లక్ష్మీ దేవి, సీమా నాయనమ్మ

సీమా గురించిన కథనాలు సోషల్ మీడియాలో వైరల్ కాగా, వైద్య శాఖ స్పందించింది. అధికారులు వచ్చి సీమా కాలిని పరిశీలించారు. ఆమెకు కృత్రిమ కాళ్లను అమర్చాలని నిర్ణయించారు. మరోవైపు, జముయీ మేజిస్ట్రేట్ అవ్నీశ్ కుమార్ సింగ్.. బాలికకు మూడు చక్రాల కుర్చీని అందజేశారు. ఈ క్రమంలోనే తాజాగా సోనూసూద్ సైతం సీమా కోసం సాయం చేసేందుకు ముందుకొచ్చారు. ఇకపై సీమా రెండు కాళ్లతో నడుస్తుందని అన్నారు. సీమా కోసం టికెట్లు పంపిస్తున్నానని ట్వీట్ చేశారు.

divyang girl from jamui
మూడు చక్రాల కుర్చీ అందించిన జిల్లా మేజిస్ట్రేట్
divyang girl from jamui
సోనూసూద్ ట్వీట్

ఇదీ చదవండి:

Last Updated : May 25, 2022, 9:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.