ETV Bharat / bharat

మహారాష్ట్ర శిశు మరణాలపై మోదీ దిగ్భ్రాంతి

fire accident in ICU
ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం
author img

By

Published : Jan 9, 2021, 6:14 AM IST

Updated : Jan 9, 2021, 9:47 AM IST

09:43 January 09

'బాధ్యులను శిక్షించాలి'

మహారాష్ట్ర భండారా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం సంభవించి 10మంది నవజాతి శిశువులు మరణించిన ఘటనపై విచారణ వ్యక్తం చేశారు ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్​. ఘటనపై వెంటనే దర్యాప్తు చేసి బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేశారు.

09:36 January 09

ఘటనపై దర్యాప్తు...

మహారాష్ట్ర శిశు మరణాల ఘటనపై ఆ రాష్ట్ర ఆరోగ్యమంత్రి రాజేశ్​ తోపేతో చర్చించారు ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రే. భండారా జిల్లా కలెక్టర్​, ఎస్​పీతోనూ మాట్లాడారు. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్టు సీఎం కార్యాలయం వెల్లడించింది.

మరోవైపు మృతుల కుటుంబసభ్యులకు రూ. 5లక్షల పరిహారం ప్రకటించింది మహారాష్ట్ర ప్రభుత్వం.

09:28 January 09

మోదీ దిగ్భ్రాంతి

మహారాష్ట్రలో 10మంది నవజాత శిశువుల మరణాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శిశువుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ట్వీట్​ చేశారు.

అగ్ని ప్రమాదంలో శిశువులు మరణించిన ఘటన ఎంతో దురదృష్టకరమని పేర్కొన్నారు కేంద్రమంత్రి అమిత్​ షా. ఈ వార్త తనను ఎంతో బాధించిందన్నారు.

ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ.. బాధితులను ఆదుకునేందుకు అన్ని విధాలుగా సహాయం చేయాలన్నారు.

06:12 January 09

10 మంది నవజాత శిశువులు మృతి

మహారాష్ట్ర భండారా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 10 మంది నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు ప్రాణాలతో బయటపడ్డారు. ఐసీయూ విభాగంలో శుక్రవారం అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరగటమే కారణంగా తెలుస్తోంది. ఘటన జరగిన సమయంలో మొత్తం 17 మంది చిన్నారులు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.

అర్ధరాత్రి సమయంలో ఐసీయూ గది నుంచి దట్టమైన పొగ బయటకి రావటాన్ని గమనించిన ఆసుపత్రి సిబ్బంది తలుపులు తెరిచారు. అప్పటికే గది మొత్తం పొగతో నిండిపోయినట్లు తెలిపారు. వెంటనే ఆసుపత్రి యాజమాన్యానికి, అగ్నిమాపక విభాగానికి సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపు చేశారు. ఎస్​ఎన్​ఐసీలో అవుట్​ బార్న్​, ఇన్​బార్న్​ అని రెండు విభాగాలు ఉండగా.. అవుట్​బార్న్​లో ఉన్న 10 మంది చిన్నారులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మరో ఏడుగురు చిన్నారులను రక్షించి మరో ఆసుపత్రికి తరలించారు. ఇతర రోగులను సైతం సురక్షిత ప్రాంతానికి తరలించారు. 

ప్రమాదానికి విద్యుత్తు షార్ట్​సర్య్కూట్​ కారణంగా భావిస్తున్నారు అధికారులు. 

Last Updated : Jan 9, 2021, 9:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.