ETV Bharat / bharat

కూతురికి పిల్లలు లేరని దారుణం.. 10 నెలల చిన్నారి కిడ్నాప్​.. అడ్డొచ్చిన ఆమె తల్లిని..

తమ కుమార్తెకు పిల్లలు లేరని దారుణానికి పాల్పడ్డారు దంపతులు. 10 నెలల చిన్నారికి కిడ్నాప్ చేసి ఆమెకు ఇచ్చేందుకు ప్లాన్ చేశారు. ఈ క్రమంలో అడ్డొచ్చిన చిన్నారి తల్లిని హత్య చేశారు. ఈ ఘటన అసోంలో జరిగింది. మరోవైపు, పరీక్షల్లో పాస్ చెయ్యాలంటే తనకు లైంగికంగా సహకరించమని విద్యార్థినిని వేధించాడు ఓ ప్రొఫెసర్. ఈ దారుణం రాజస్థాన్​లో వెలుగు చూసింది.

murder
హత్య
author img

By

Published : Dec 22, 2022, 11:48 AM IST

పెళ్లైన తమ కుమార్తెకు చాలా ఏళ్లు గడిచినా పిల్లలు లేరని దారుణానికి పాల్పడ్డారు ఆమె తల్లిదండ్రులు. ఓ మహిళతో పాటు ఆమె 10 నెలల చిన్నారిని కిడ్నాప్ చేశారు. అనంతరం మహిళను హత్య చేశారు. ఈ ఘటన అసోంలోని శివసాగర్​లో జరిగింది. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
బైలుంగ్‌గావ్‌ గ్రామానికి చెందిన నితుమోని లుఖురాషన్‌ అనే మహిళ సహా ఆమె పది నెలల చిన్నారి డిసెంబరు 13 నుంచి కనిపించట్లేదు. అయితే నితుమోని మృతదేహం.. మంగళవారం రాజభరీ అనే టీఎస్టేట్​లో కనిపించింది. ఆమె శరీరంపై తీవ్రమైన గాయాలున్నాయి. ఈ కేసులో నిందితులు బసంత గొగొయ్​, హిమయై గొగొయ్​ అనే దంపతులను సిమలుగురి రైల్వే స్టేషన్​లో పోలీసులు అరెస్ట్ చేశారు. వారు హిమచల్ ప్రదేశ్​లో ఉన్న తమ కూతురికి చిన్నారిని ఇచ్చేందుకు వెళ్తుండగా వారిని పట్టుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా.. అసలు విషయం బయటపడింది.

"నితుమోని లఖురాషన్ అనే మహిళను దంపతులు హత్య చేశారు. ఈ హత్యను పథకం ప్రకారం చేశారు. హిమాచల్​ప్రదేశ్​లోని ఉన్న నిందితుల కుమార్తెకు పిల్లలు లేరు. అందువల్ల మృతురాలు నితుమోని చిన్నారిని ఆమెకు ఇచ్చేందుకు ప్లాన్ వేశారు. నితుమోనిని ఇంటికి ఆహ్వానించి ఆమె బిడ్డను లాక్కునేందుకు ప్రయత్నించారు. ఆమె ప్రతిఘటించడం వల్ల పదునైన ఆయుధంతో కొట్టి హత్య చేశారు. అలాగే నిందితులకు వారి కుమారుడు ప్రశాంత గొగొయ్​ సాయపడ్డాడు. అతడిని అరెస్ట్ చేశాం."

--పోలీసులు

లైంగికంగా సహకరిస్తే పాస్ చేస్తా..
విద్యార్థిని పట్ల అమానవీయంగా ప్రవర్తించాడు రాజస్థాన్ టెక్నికల్ యూనివర్సిటీ అసోసియేట్​ ప్రొఫెసర్​. తనతో శారీరక సంబంధం పెట్టుకోకపోతే పరీక్షల్లో ఫెయిల్​​ చేస్తానని బెదిరించాడు. రాజస్థాన్.. కోటాలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడు గిరీష్ పర్మార్​గా పోలీసులు గుర్తించారు. అతడిపై కేసు నమోదైనప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. అంతకుముందు విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని పలుమార్లు ఫిర్యాదు చేసినా యూనివర్సిటీ అధికారులు పట్టించుకోలేదని విద్యార్థులు పోలీసులకు తెలిపారు.

మైనర్​పై గ్యాంగ్​రేప్​..
రాజస్థాన్ ధోల్​పుర్​లో ఘోరం జరిగింది. 16 ఏళ్ల మైనర్​పై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసు వెలుగులోకి వచ్చింది. బాధితురాలు తన బావ, అతడి కుమారుడు, సోదరుడు తనపై అఘాయిత్యానికి పాల్పడి.. అనంతరం కోల్​కతాలోని రెడ్ లైట్ ఏరియాలో వదిలేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఇదీ జరిగింది..
బాధితురాలు తండ్రి 2020లో ఓ కేసులో జైలుకెళ్లాడు. అప్పుడు బాధితురాలు అక్క ఆమెను తన అత్తవారింటికి తీసుకెళ్లింది. అక్కడ బాధితురాలిపై ఆమె బావ, అతడి సోదరుడు అత్యాచారానికి పాల్పడ్డారు. అలాగే ఆమె అక్క కుమారుడు, వారి స్నేహితులు సైతం మైనర్​పై అత్యాచారానికి ఒడిగట్టారు. ప్రతిఘటిస్తే బాధితురాలిని తీవ్రంగా కొట్టేవారు. ఈ విషయం మైనర్​.. అక్కకు తెలిసినా ఆమె పట్టించుకోలేదు. కొద్ది రోజుల క్రితం బాధితురాలి తండ్రి జైలు నుంచి విడుదలయ్యాడు. ఈ క్రమంలో తనపై జరిగిన దారుణాన్ని అతడికి చెప్పింది. పోలీసులకు బాధితురాలి తండ్రి ఫిర్యాదు చేశాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.