ETV Bharat / bharat

10, 12వ తరగతుల బోర్డు పరీక్షలు రద్దు పిటిషన్ కొట్టివేత

author img

By

Published : Feb 24, 2022, 7:57 AM IST

10 12 board exam 2022 news: సీబీఎస్‌ఈ సహా ఇతర బోర్డులు ఈ ఏడాది నిర్వహించే 10, 12వ తరగతి ఆఫ్‌లైన్‌ పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇలాంటి పిటిషన్లు విద్యార్థుల్లో గందరగోళం సృష్టిస్తాయని, తప్పుడు విశ్వాసం కలగజేస్తాయని సర్వోన్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. వీటితో పాటు పలు కీలక కేసులపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఆ వివరాలు ఇలా...

supreme court cases
supreme court cases

10 12 board exam 2022 news: కొవిడ్‌-19 నేపథ్యంలో 10, 12 తరగతుల విద్యార్థులకు వివిధ విద్యా మండళ్లు(బోర్డులు) భౌతికంగా నిర్వహించే వార్షిక పరీక్షలను రద్దు చేసి, ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించేలా ఆదేశించాలన్న పిటిషనర్‌ అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఇటువంటి పిటిషన్లు విద్యార్థుల్లో తప్పుడు ఆశలను కల్పించడంతో పాటు గందరగోళ పరుస్తాయని జస్టిస్‌ ఏ.ఎం.ఖన్విల్కర్‌ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారంమండిపడింది. ఇప్పటికీ చాలా విద్యా మండళ్లు పరీక్షల తేదీలను ప్రకటించలేదని గుర్తు చేసింది. అధికారులు, విద్యార్థులను వారి వారి పనుల్ని చేసుకోనివ్వాలని స్పష్టం చేసింది.

Supreme Court Board exams news

ఒక దశలో పిటిషనర్‌కు జరిమానా విధించాలన్న అభిప్రాయాన్ని కూడా ధర్మాసనం వ్యక్తం చేసింది. క్షేత్ర స్థాయి పరిస్థితులను సమీక్షించి అధికారులు నిర్ణయం తీసుకుంటారని, పిటిషనర్‌ ఏమైనా చెప్పాలనుకుంటే వారిని సంప్రదించవచ్చని సూచించింది. ఈ ధర్మాసనంలో జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరి, జస్టిస్‌ సి.టి.రవికుమార్‌ కూడా సభ్యులుగా ఉన్నారు.

మాల్యా, చోక్సీ, నీరవ్​ల నుంచి రూ.18వేల కోట్లకు పైగా జప్తు

నగదు అక్రమ చెలామణి నిరోధక చట్టం(పేఎంఎల్‌ఏ)-2002 అమలులోకి వచ్చిన తర్వాత నుంచి ఇప్పటి వరకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) 4700కేసులను దర్యాప్తు చేసిందని, 313 మందిని అరెస్టు చేసిందని సుప్రీంకోర్టుకు బుధవారం కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కఠిన చర్యలు వద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ అయిన కేసులతో ముడిపడిన మొత్తం రూ.67వేల కోట్లుగా ఉందని జస్టిస్‌ ఎ. ఎం. ఖన్విల్కర్‌ ధర్మాసనానికి వివరించింది. వివిధ ఆర్థిక నేరారోపణల్లో నిందితులు, విదేశాలకు పరారైన విజయ్‌మాల్యా, మెహుల్‌ చోక్సీ, నీరవ్‌ మోదీల కేసుల్లో న్యాయస్థానాల ఆదేశాల మేరకు తీసుకున్న చర్యల్లో భాగంగా రూ.18వేల కోట్లకు పైగా ఈడీ జప్తు చేసినట్లు సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వెల్లడించారు.

పిఎంఎల్‌ఎలోని పలునిబంధనల వివరణలకు సంబంధించి దాఖలైన వ్యాజ్యాలపై విచారణ సందర్భంగా ఈ విషయాలు ధర్మాసనం ముందుకు వచ్చాయి. 2016-2021 మధ్య 2186 కేసుల్లో ఈడీ దర్యాప్తు చేపట్టిందని తుషార్‌ మెహతా తెలిపారు.

వినియోగదారుల కమిషన్లకు వనతుల్లో జాప్యంపై రాష్ట్రాలకు చురకలు

వినియోగదారుల కమిషన్లకు మౌలిక వసతులు కల్పించడం కోసం కేటాయించిన నిధులను సత్వరమే వినియోగించేలా నోడల్‌ అధికారులను నియమించాలన్న ఆదేశాలను అమలుచేయని రాష్ట్రాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారుల నియామకాలపై నివేదిక సమర్పించని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు బుధవారం రూ. లక్ష జరిమానా విధించింది. పరిస్థితి తీవ్రతను గుర్తించడంలేదని, అర్థమయ్యేలా చేసేందుకు కఠినంగా వ్యవహరించక తప్పదని జస్టిస్‌ ఎస్‌.కె. కౌల్‌, జస్టిస్‌ ఎం.ఎం.సుందరేశ్‌ ధర్మాసనం ఈ సందర్భంగా పేర్కొంది. ధర్మాసనం ఆదేశాల అమలుకు సంబంధించి ఇప్పటివరకు 22 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు నివేదికలు సమర్పించాయని, 12 మినహా అన్ని రాష్ట్రాలు నోడల్‌ అధికారులను నియమించాయని ఈ కేసులో కోర్టు సహాయకుడి(అమికస్‌ క్యూరీ)గా ఉన్న న్యాయవాది ఆదిత్య నారాయణ్‌ సర్వోన్నత న్యాయస్థానానికి వివరించారు.

ఆదేశాల అమలు నివేదికల సమర్పణకు ధర్మాసనం నాలుగు వారాల గడువనిచ్చింది. తదుపరి విచారణను ఏప్రిల్‌ 12వ తేదీకి వాయిదా వేసింది. జిల్లా, రాష్ట్రస్థాయి వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్లలో ఖాళీగా ఉన్న పోస్టులన్నిటినీ ఈ ఏడాది జనవరి చివరికల్లా భర్తీ చేయాలని సుప్రీంకోర్టు గతంలో ఆదేశించింది. ఆయా కమిషన్లలో మౌలిక వసతుల కల్పనపై సమర్పించిన నిధుల వినియోగ ధ్రువీకరణ పత్రాలు క్షేత్రస్థాయిలో పరిస్థితులు సవ్యంగా లేవని తెలియజేస్తున్నాయని అభిప్రాయపడింది.

ఈనీఎఫ్‌ విరాళం చెల్లింవులో జాప్యానికీ యాజునూన్వానిదే బాధ్యత

ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్‌)కి జమ చేయాల్సిన విరాళంలో జాప్యం జరిగితే అందుకు బాధ్యత వహించడంతో పాటు విధించే జరిమానాలను చెల్లించాల్సిన బాధ్యత సంస్థ యాజమాన్యానిదేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 20 మంది లేదా అంతకుమించిన సంఖ్యలో ఉద్యోగులు పనిచేస్తున్న సంస్థలకు ఈపీఎఫ్‌ చట్ట నిబంధనలు వర్తిస్తాయని జస్టిస్‌ అజయ్‌ రస్తోగి, జస్టిస్‌ అభయ్‌ ఎస్‌.ఓకా ధర్మాసనం పేర్కొంది. ఆ చట్టం ప్రకారం ఉద్యోగుల నుంచి భవిష్య నిధికి చెల్లించాల్సిన మొత్తాన్ని వసూలు చేసి దాన్ని వారి ఈపీఎఫ్‌ ఖాతాలో జమ చేయాల్సిన బాధ్యత సంస్థల నిర్వాహకులదేనని వెల్లడించింది.

ఈ ప్రక్రియలో జాష్యం జరిగితే విధించే జరిమానాలను యాజమాన్యాలే చెల్లించాల్సి ఉంటుందని కర్ణాటక హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా తెలిపింది.

రామసేతుపై మార్చి 9న విచారణ

రామ సేతును జాతీయ వారసత్వ స్మారకంగా ప్రకటించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై మార్చి 8న విచారణ జరపనున్నట్లు సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. భాజపా నేత సుబ్రమణ్య స్వామి ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. కొన్ని నెలలుగా తన పిటిషన్‌ విచారణకు రావడంలేదని, విచారణ జాబితా నుంచి దానిని తొలగించరాదని బుధవారం ఆయన విజ్ఞప్తి చేశారు. గత ఏడాది ఏప్రిల్‌ 8న కూడా దీనిపై అత్యవసర విచారణ జరపాలని తాను కోరినట్లు గుర్తు చేశారు. మార్చి 9న విచారణ జరిపే పిటిషన్‌లలో దానిని చేర్చుతామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ ఎ. ఎస్‌. బోపన్న, జస్టిస్‌ హిమాకోహ్లి నేతృ త్వంలోని ధర్మాసనం తెలిపింది. సుబ్రమణ్యస్వామి దాఖలు చేసిన పిటిషన్‌ వల్ల రామ సేతు ప్రాజెక్టు పనుల నిలిపివేతకు 2007లో ఉత్తర్వులు వెలువడ్డాయి. రామసేతుకు నష్టం కలగని విధంగా షిప్పింగ్‌ ఛానెల్‌ ప్రాజెక్టు మార్గానికి మార్పులు చేస్తామని అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.. పిటిషన్‌లో రెండో అంశమైన జాతీయ వారసత్వ స్మారకంగా ప్రకటించాలన్న అభ్యర్థన పెండింగ్‌లో ఉంది.

ఇదీ చదవండి: యూపీలో సంక్షేమ పథకాలపైనే భాజపా ఆశలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.