ETV Bharat / bharat

ఎస్​ఐ ఉద్యోగాల్లో ట్రాన్స్​జెండర్లకు 1% రిజర్వేషన్​

Reservation for transgenders: స్పెషల్ రిజర్వ్​ సబ్​- ఇన్​స్పెక్టర్ ఉద్యోగాల కోసం పురుషులు, మహిళలతో పాటు ట్రాన్స్​జెండర్ల నుంచి కూడా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కర్ణాటక పోలీసు శాఖ తెలిపింది. ఈ ఉద్యోగాల్లో ట్రాన్స్​జెండర్లకు ఒక శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు ప్రకటించింది.

author img

By

Published : Dec 21, 2021, 7:46 PM IST

Reservation for transgenders:
ట్రాన్స్​జెండర్లకు 1% రిజర్వేషన్​

Reservation for transgenders: లింగ వివక్షతను రూపుమాపేలా కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కర్ణాటక స్టేట్ రిజర్వ్​ పోలీస్(కేఎస్​ఆర్​పీ), ఇండియన్ రిజర్వ్​ బెటాలియన్​లో ​(ఐఆర్​బీ) స్పెషల్ రిజర్వ్​ సబ్​- ఇన్​స్పెక్టర్​ పోస్టులకుగాను మహిళలు, పురుషులతో పాటు ట్రాన్స్​జెండర్లూ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ ఉద్యోగాల్లో ట్రాన్స్​జెండర్లకు ఒక శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు ప్రకటించింది.

Transgenders in karnataka police: కర్ణాటక రాష్ట్ర పోలీసు శాఖలో ఉద్యోగాలకు సంబంధించి సోమవారం ఆ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. 70 ఖాళీలు ఉన్న ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులకు జనవరి 18 వరకు గడువు ఇస్తున్నట్లు తెలిపింది. ఈ ఉద్యోగాల్లో ట్రాన్స్​జెండర్లు ఒక శాతం రిజర్వేషన్ పొందుతారని స్పష్టం చేసింది.

అయితే.. ఈ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో ట్రాన్స్​జెండర్ అభ్యర్థులు జిల్లా కలెక్టర్​ జారీ చేసిన 'ట్రాన్స్​జెండర్​ సర్టిఫికెట్'​ను సమర్పించాల్సి ఉంటుంది. లేదంటే.. వారి దరఖాస్తును తిరస్కరిస్తారు. "కర్ణాటక రాష్ట్ర పోలీసు శాఖ అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తోంది. మేము మహిళలు, పురుషులను, ట్రాన్స్​జెండర్లను పోలీసు ఉద్యోగాల్లో నియమించుకుంటాం" అని ట్విట్టర్​ వేదికగా కర్ణాటక డీజీపీ ప్రవీణ్ పేర్కొన్నారు.

దేశంలోనే మొదటి రాష్ట్రం..

First state for transgender reservations: ట్రాన్స్​జెండర్లకు రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ.. 'సంగమ' అనే స్వచ్ఛంద సంస్థ, సామాజిక కార్యకర్త నీషా గులార్.. కర్ణాటక హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని(పీఐఎల్​) దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. ట్రాన్స్​జెండర్లకు అన్నిరంగాల్లో ఒక శాతం రిజర్వేషన్ కల్పించాలని కర్ణాటక ప్రభుత్వాన్ని ఈ ఏడాది జులై 20న ఆదేశించింది. ఈ నేపథ్యంలో కర్ణాటక పోలీసు శాఖ ప్రస్తుతం ఎస్​ఐ ఉద్యోగాల్లో ట్రాన్స్​జెండర్లకు రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో దేశంలోనే.. ప్రభుత్వ సర్వీసుల్లో ట్రాన్స్​జెండర్లకు రిజర్వేషన్ కల్పించనున్న మొదటి రాష్ట్రంగా కర్ణాటక నిలిచింది.

ట్రాన్స్​జెండర్ల హర్షం..

"కర్ణాటక పోలీసు శాఖ నిర్ణయాన్ని మేం స్వాగతిస్తున్నాం. అంతకుముందు మాకు ఎలాంటి సదుపాయాలు ఉండేవి కావు. కానీ, ఇప్పుడు ఒక్కొక్కటిగా మేం అన్నింటిని పొందుతున్నాం. నేను ఎంఏ జర్నలిజం పూర్తి చేశాను. పోలీసు శాఖలో చేరేందుకు నేను కూడా ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేస్తాను" అని ఓ ట్రాన్స్​జెండర్ తెలిపారు.

ఇదీ చూడండి: Rahul lynching: '2014కు ముందు 'మూకదాడి' పదమే వినలేదు'

ఇదీ చూడండి: టీఎంసీదే 'కోల్​కతా' పీఠం.. భాజపాపై దీదీ సెటైర్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.