FASHION SHOW: అందాల పోటీల్లో అదరగొట్టిన అతివలు.. కళ్లు తిప్పుకోని చూపరులు! - telugu news
🎬 Watch Now: Feature Video
FASHION SHOW IN VIJAYAWADA: విజయవాడలో తేజాస్ ఎలైట్స్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన 'శ్రీమతి అమరావతి' ఫ్యాషన్ షో ఫైనల్స్ ఉత్సాహంగా సాగాయి. ఆరేళ్లుగా వివాహితులకు శ్రీమతి అమరావతి పేరిట అందాల పోటీలు నిర్వహిస్తున్నారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించే దిశగా ఏర్పాటు చేస్తోన్న ఈ కార్యక్రమం ఫైనల్స్‌లో.. 35 మంది మహిళలు పాల్గొన్నారు. ర్యాంప్‌పై హొయలొలికిస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి బిగ్ బాస్ ఫేమ్ నటి ప్రియా, నటి మాధవి లత, ప్రముఖ టీవీ సీరియల్ నటి శోభా శెట్టి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ షోలో మొదటి విజేతకు 50 వేల రూపాయలు పారితోషికం అందజేశారు.