ప్రతిధ్వని: సంక్షోభం నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుందా..?
🎬 Watch Now: Feature Video
లాక్డౌన్ సడలింపుల తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం ప్రారంభమైనా... మూడో త్రైమాసికం నుంచి అది నెమ్మదిస్తుందని ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ అంచనా వేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్దీపన చర్యల ప్రభావం జూన్లో ఉన్నా.. ఇప్పడు కనిపించడం లేదని వెల్లడించింది. కరోనా ముందు స్థాయి వృద్ధిని చేరేందుకు ఎక్కువ సమయమే పడుతుందని తన అధ్యయనంలో పేర్కొంది. మరో వైపు దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయని భారత పరిశ్రమల సమాఖ్య వెల్లడించింది. వీ తరహాలో ఆర్థిక వ్యవస్థ కోలుకోబోతుందని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది..? ఏయే రంగాలు నెమ్మదిగా పుంజుకుంటున్నాయి? కరోనా వ్యాక్సిన్ వస్తే ఆర్థిక వ్యవస్థ వేగం అందుకుంటుందా? అనే అంశాలపై ఈనాటి ప్రతిధ్వని చర్చ..!