TDP Leaders Comment on Vijayasai Reddy: సొంత చిన్నాయనను చంపి జైలుకెళ్లిన చరిత్ర విజయసాయి రెడ్డి కుటుంబానిదని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆరోపించారు. రాజీనామా పేరుతో రాత్రి నుంచి విజయసాయిరెడ్డి వేస్తున్న ఎత్తులు, పైఎత్తులు, నక్కజిత్తులు చూస్తున్నామన్నారు. కాంగ్రెస్, వైఎస్సార్సీపీలకు వ్యతిరేకంగా పోరాడే తనపై కక్షకట్టి కాకాణి గోవర్ధన్ రెడ్డితో కలిసి కుట్రలు చేసిన దుర్మార్గుడు విజయసాయిరెడ్డి అని సోమిరెడ్డి దుయ్యబట్టారు. తండ్రులు ఇచ్చిన ఆస్తులను రాజకీయాల కోసం అమ్ముకున్న కుటుంబం తమదని సోమిరెడ్డి గుర్తు చేశారు. విజయసాయి రెడ్డితో పాటు ఆయన వియ్యంకుడి కుటుంబం చేసిన పాపాలను ఎన్ని జన్మలెత్తినా దేవుడు క్షమించరని, ఫలితం అనుభవించి తీరాల్సిందేనని సోమిరెడ్డి అన్నారు.
వైఎస్సార్సీపీ మునిగిపోయిన నావ: ఎంపీ పదవికి విజయసాయిరెడ్డి రాజీనామా చేసినా చట్టం నుంచి తప్పించుకోలేరని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. విజయసాయితో విశాఖలో పడిన ఇబ్బందులు, జరిగిన విధ్వంసం, దాడులను ప్రజలు మరిచిపోలేదని చెప్పారు. వైఎస్సార్సీపీ మునిగిపోయిన నావ అని ఎప్పుడో చెప్పామని కానీ అది ఇప్పుడు నిజమవుతోందని అన్నారు. జగన్ నైజమే దీనికి కారణమని చెప్పుకొచ్చారు. ఇంకా కొంతమంది ఆ పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
రాజకీయాల నుంచి తప్పుకుంటే నాపై కేసులు ఎందుకు తొలగిస్తారు : విజయసాయిరెడ్డి
వారి హింస తట్టుకోలేకే రాజీనామా: వైఎస్సార్సీపీ నేత విజయసాయిరెడ్డి రాజీనామాపై తెలుగుదేశం నేత డొక్కా మాణిక్యవరప్రసాద్ వ్యంగ్యస్త్రాలు సంధించారు. జగన్‌కు భయపడే ఆర్థిక నేరాల్లో ఆరితేరిన విజయసాయిరెడ్డి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేశారని డొక్కా విమర్శించారు. జగన్ వద్ద సజ్జల వర్గం బలంగా ఉందని ఆయన కనుసన్నల్లోనే పార్టీ వ్యవహారాలు నడుస్తున్నాయన్నారు. వారి హింస తట్టుకోలేక విజయసాయిరెడ్డి రాజీనామా చేశారని ఎద్దేవా చేశారు.
ప్రతీ మాటా గుర్తుంది: జగన్, విజయసాయిరెడ్డి తమపై ఉన్న కేసులను పక్కదారి పట్టించటానికి కలిసి డ్రామాలాడుతున్నారని టీడీపీ నేత బుద్ధా వెంకన్న విమర్శించారు. చంద్రబాబుతో వ్యక్తిగత విభేదాలు లేవని ఆయన అంటే నమ్మేంత పిచ్చోళ్లు ప్రజలు కాదన్నారు. విజయసాయిరెడ్డి చంద్రబాబుని అన్న ప్రతీ మాటా తమకు ఇంకా గుర్తు ఉందని చేసినవి అన్నీ చేసి ఈరోజు రాజీనామా చేసి వెళ్లిపోతా అంటే కుదరదన్నారు. భూ కబ్జాలు, దోపిడీలు ఉత్తరాంధ్రలో అరాచకాలు ఇలా ప్రతి దానికీ లెక్క తేలాలన్నారు. విజయసాయిరెడ్డి దేశం విడిచి వెళ్లడానికి సీబీఐ అనుమతి ఇవ్వకూడదని డిమాండ్ చేశారు. విజయసాయిరెడ్డి ఎన్ని నాటకాలు ఆడినా, ఎవరు క్షమించినా తాను మాత్రం ఆయనను వదిలిపెట్టే ప్రసక్తే లేదని బూద్ధా వెంకన్న స్పష్టం చేశారు.
జగన్ రెడ్డి, @VSReddy_MP కలిసి ఆడుతున్న డ్రామా ఇది..! @ysjagan కి తెలిసే అంతా జరుగుతుంది.. వీళ్లిద్దరి కేసులు పక్కదారి పట్టించడానికి ఆడతున్న నాటకం ఇదంతా..!
— Budda Venkanna (@BuddaVenkanna) January 25, 2025
చంద్రబాబు గారితో వ్యక్తిగత విభేదాలు లేవు అంటే నమ్మెంత పిచ్చోళ్ళు కాదు ప్రజలు.. విజయసాయి రెడ్డి చంద్రబాబు గారిని అన్న ప్రతి…