How to Clean Steel Tea Strainer : ఉదయాన్నే కప్పు టీ తాగకుండా మనలో చాలా మందికి రోజు ప్రారంభం కాదు. వేడివేడి టీ తాగగానే ఎంతో హాయిగా అనిపిస్తుంటుంది. అయితే, రోజూ టీ చేసే క్రమంలో టీ వడకట్టడానికి ఉపయోగించే స్ట్రెయినర్ నల్లగా మారిపోతుంది. సాధారణ పాత్రల మాదిరే దానిని శుభ్రం చేసినా ఆ మురికి ఓ పట్టాన వదలదు. పైగా అక్కడక్కడ నల్లగా పేరుకుపోయి ఉంటుంది. అలాంటప్పుడు కొన్ని టిప్స్ పాటించి టీ జాలి క్లీన్ చేస్తే కొత్తదానిలా మెరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఆ టిప్స్ ఏంటో చూసి ఇంట్లో మీరూ ఓసారి ట్రై చేయండి!
బేకింగ్ సోడా : వంటింట్లో బేకింగ్ సోడాతో చాలా ఉపయోగాలు ఉన్నాయి. బేకింగ్ సోడాతో వంట పాత్రల జిడ్డు తొలగించడమే కాకుండా కొత్త వాటిలా మెరిపించవచ్చు. మీరు మీ టీ స్ట్రెయినర్‌ని కూడా బేకింగ్ సోడాతో కొత్తదానిలా మార్చవచ్చు. ఇందుకోసం కప్పు వేడి నీటిలో టేబుల్‌స్పూన్ బేకింగ్ సోడా వేసి మిక్స్ చేయండి. ఇందులో నల్లగా మారిన జాలి వేయండి. నీరు చల్లారిన తర్వాత కాస్త టూత్‌పేస్ట్ రాసి స్క్రబ్బర్‌తో రుద్దుతూ క్లీన్ చేస్తే సరి.
నిమ్మచెక్కతో : మురికిగా ఉన్న టీ స్ట్రెయినర్‌ని ఒక నిమ్మచెక్క సహాయంతో బాగా రుద్దండి. ఆపై కాస్త డిష్ వాష్ వేసి రుద్దండి. ఇప్పుడు ట్యాప్ కింద నీళ్లతో క్లీన్ చేయండి. అంతే ఇలా సులభంగా మురికిని మాయం చేయవచ్చు.
వేడి నీళ్లు : ఇందుకోసం వేడినీళ్ల పాత్రలో కాసేపు టీ గరిటె నానబెట్టండి. నీరు చల్లగా అయిన తర్వాత కాస్త డిష్‌వాష్ సోప్ వేసి రుద్దుతూ క్లీన్ చేయండి. అంతే ఇలా సింపుల్‌గా టీ స్ట్రెయినర్‌ని మెరిపించవచ్చు.
బేకింగ్ పౌడర్, డిష్ వాష్ : మన అందరి ఇళ్లలో ఉండే డిష్ వాష్, బేకింగ్ పౌడర్‌తో ఈజీగా టీ గరిటెని క్లీన్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఒక గిన్నెలో వేడివేడి నీళ్లు తీసుకోండి. అందులో కాస్త డిష్ వాష్, టేబుల్‌స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేయండి. ఆపై టీ స్ట్రెయినర్‌ని 15 నిమిషాలు నానబెట్టి శుభ్రం చేయండి.
వెనిగర్ : ముందుగా ఒక కప్పు వేడి నీరులో కాస్త వెనిగర్ కలపండి. ఆపై మురికిగా ఉన్న టీ స్ట్రెయినర్‌ని నానబెట్టండి. అనంతరం స్క్రబ్బర్‌తో బాగా తోమండి. ఇలా చేస్తే స్ట్రెయినర్ తళతళా మెరుస్తుంది.
మీకు తెలుసా? - చక్కెరను టీ/ కాఫీల్లోనే కాదు - ఇలా కూడా ఉపయోగించవచ్చు!
ప్రపంచంలోనే అత్యంత పొడవైన రహదారి - రెండు ఖండాలు, 14దేశాల మీదుగా ప్రయాణం