10th Class Student Died In Road Accident: బడికెళ్లిన కుమార్తె తిరిగి వస్తుందనుకున్నారు. రోజు మాదిరిగానే వెళ్లిన బిడ్డ తిరిగిరాని లోకాలకు వెళ్తుందని ఆ తల్లిదండ్రులు కలలో కూడా ఊహించి ఉండరు. ఆటో రూపంలో మృత్యువు కబళించడంతో ఆ కుటుంబం శోక సంద్రంలో మునిగింది. పాఠశాలకు ఆటోలో వెళ్తున్న పదో తరగతి విద్యార్థిని వాహనం బోల్తా పడి మృతి చెందిన ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది.
ఆటో బోల్తా పడి పదో తరగతి విద్యార్థిని మృతి: స్కూలుకు వెళుతున్న పదో తరగతి విద్యార్థిని ఆటో బోల్తా పడటంతో మృతి చెందింది. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం సుంకేశ్వరి గ్రామానికి చెందిన విద్యార్థులు విద్యానగర్ ప్రభుత్వ పాఠశాలకు ఆటోలో బయలుదేరారు. కొద్ది దూరం వెళ్లేసరికి వెనక నుంచి వేగంగా వచ్చిన మరో ఆటో దీన్ని ఢీ కొట్టింది. దీంతో ఆటో బోల్తా పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు విద్యార్థులకు తీవ్ర గాయాలవ్వగా పదో తరగతి విద్యార్థిని అనూష పరిస్థితి విషమంగా ఉండటంతో ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో వారి కుటుంబం విషాదంలో మునిగిపోయింది.
ఆటోను ఢీకొన్న లారీ - పదో తరగతి విద్యార్థిని మృతి
మలక్‌పేట మెట్రో స్టేషన్ దగ్గర అగ్ని ప్రమాదం - 5 వాహనాలు దగ్ధం