ప్రతిధ్వని: అప్పుల తిప్పల నుంచి బయటపడేది ఎలా? - రుణాల విషయంపై ప్రతిధ్వని చర్చ
🎬 Watch Now: Feature Video
అసలే ఆర్ధిక కష్టాల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఊహించని షాక్‌ఇచ్చింది. బహిరంగ మార్కెట్ రుణ పరిమితిలో భారీగా కోత విధించింది. రాష్ట్రానికి ఇక మిగిలిన రుణ పరిమితి 27 వేల 668 కోట్ల రూపాయలే అని కేంద్ర ఆర్థిక శాఖ పంపిన లేఖ... ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఓ వైపు రాష్ట్రప్రభుత్వం కొత్త రుణాల కోసం విశ్వప్రయత్నాలు చేస్తుంటే.. కేంద్రం తీసుకున్న నిర్ణయం.. ఎలాంటి ప్రభావం చూపించబోతోంది? ఈ ఆర్ధిక సంవత్సరం నికర రుణ పరిమితికి ఎందుకు కోత పడింది? ఫలితంగా.. ప్రభుత్వ నిర్వహణ, ప్రజా పరిపాలనకు ఎలాంటి సవాళ్లు ఎదురుకానున్నాయి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.