Prathidwani విపక్షాలను వేధించే అస్త్రంగా ఈడీ మారిందన్న విమర్శలెందుకు - ఈడీ తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-16179691-491-16179691-1661268871604.jpg)
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు విస్తృత అధికారాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. నగదు అక్రమ చెలామణి నిరోధక చట్టం ప్రకారం నిందితులకు ఎలాంటి సమాచారం లేకుండానే అరెస్టు చేసే అధికారం ఈడీకి ఉన్నట్లు ఇటీవల సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పుపై న్యాయ కోవిధులు భిన్నంగా స్పందించారు. ఇది రాజ్యాంగం కల్పించిన హక్కులను ఉల్లంఘించినట్లేనని వ్యాఖ్యానించారు. మరోవైపు ఈడీకి విస్తృత అధికారాలపై సుప్రీం తీర్పును సమీక్షించాలని సర్వోన్నత న్యాయస్థానంలో దాఖలైన పిటషన్ విచారణకు సీజేఐ ధర్మాసనం అంగీకరించింది. ఈ నేపథ్యంలో అసలు ఈడీ విధులు, అధికారాల పరిధి ఏంటి. ఈడీ విపక్షాలను వేధించే అస్త్రంగా మారిందన్న విమర్శలు ఎందుకొస్తున్నాయి. దేశంలో దర్యాప్తు సంస్థలు స్వతంత్రంగా పనిచేసే వాతావరణం ఎప్పుడొస్తుంది అనే అంశాలపై ఈ రోజు ప్రతిధ్వని.