అప్రమత్తంగా లేకుంటే ముప్పే: యూకేలో స్థిరపడిన భారతీయ వైద్యుడు - యూకేలో స్థిరపడిన భారతీయ వైద్యుడు నిమ్మగడ్డ శేషగిరిరావు
🎬 Watch Now: Feature Video
కొవిడ్‌పై యుద్ధంలో భారత్ ముందున్న సమయాన్ని ప్రభుత్వాలు సద్వినియోగం చేసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. యూకేలో స్థిరపడిన భారతీయ వైద్యుడు నిమ్మగడ్డ శేషగిరిరావు కోవిడ్ బారిన పడి బయటపడ్డారు. ఆయన సతీమణికి కూడా వైరెస్ సోకింది. దీంతో స్వీయ చికిత్సతో గృహ నిర్బంధంలో ఉంటూనే కరోనా నుంచి కోలుకున్నారు. ఆ అనుభవాలతో పాటు... కోవిడ్ విషయంలో బ్రిటన్, అమెరికా వంటి దేశాలు చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవాలని సూచిస్తున్నారు. నివారణకు ప్రస్తుత సమయంలో భారత ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని చెబుతున్నారు. లండన్ సమీపంలోని 'న్యూబరీ' టౌన్‌లోని ఓ ప్రముఖ మానసిక వైద్యశాల మెడికల్ డైరెక్టర్‌గా ఉన్న డాక్టర్ నిమ్మగడ్డ శేషగిరి రావుతో ఈటీవీ భారత్ ప్రత్యేక ముఖాముఖి.