నాగార్జునసాగర్ జలాశయం వద్ద పీవీ సింధు సందడి - నాగార్జున సాగర్ నేటి వార్తలు
🎬 Watch Now: Feature Video
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీ.వీ.సింధు నాగార్జునసాగర్ జలాశయాన్ని కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు. ఆట, సాధనతో నిరంతరం గడిపే సింధు.. సాగర్ విహారానికి వచ్చారు. భారీ వర్షాలకు ఆనకట్ట గేట్లు తెరిచి దిగువకు నీటిని వదులుతున్న నేపథ్యంలో కుటుంబసభ్యులతో కలిసి ఆమె అక్కడికి చేరుకున్నారు. తల్లిదండ్రులు పీవీ రమణ, విజయతో పాటు మరికొంతమంది కుటుంబ సభ్యులతో నాగార్జునసాగర్ వద్ద సందడి చేశారు. ఈ సందర్భంగా సింధుతో పాటు కుటుంబ సభ్యులంతా ఫొటోలు దిగుతూ సరదాగా గడిపారు. అంతకుముందు ఆనకట్ట వద్దకు చేరుకున్న సింధుకు స్థానిక అధికారులు స్వాగతం పలికారు.
Last Updated : Sep 27, 2020, 6:58 PM IST