ప్రతిధ్వని: ఆంధ్రప్రదేశ్.. 'అప్పుల తిప్పలు'! - ఆంధ్రప్రదేశ్‌పై అప్పుల భారం
🎬 Watch Now: Feature Video
అప్పుల కుప్ప... ఆంధ్రప్రదేశ్. కొంతకాలంగా ఈ విషయంపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. అధికార – విపక్షాల మధ్య మాటలయుద్ధాలు నడుస్తున్నాయి. ఖర్చు పెట్టే రూపాయిలో ఆదాయం ఎంత? అప్పు ఎంత? అని దుమారమే నడుస్తోంది. రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శికి కేంద్రం లేఖతో ఈ పరిణామాలు కొత్తమలుపు తీసుకున్నట్లైంది. ఇక రాష్ట్రం ఇష్టమొచ్చినట్లు అప్పులు చేయడానికి వీలు లేదు. ఎడాపెడా రుణాలు తీసుకుని ఖర్చు చేయడానికీ కుదరదు. అంటూ కేంద్రం నుంచి వచ్చిన సందేశం అన్నివర్గాల్లో సంచలనమైంది. అసలు ఆంధ్రప్రదేశ్‌కు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ స్థితిగతులు ఏమిటి? భవిష్యత్ ఎలా ఉండనుంది? ఇదే విషయంపై నేటి ప్రతిధ్వని.