మొదలైన ఖరీఫ్ సాగు.. అన్నదాతకు లభిస్తోన్న సహాయం ఎంత?
🎬 Watch Now: Feature Video
ఖరీఫ్ మొదలై 20 రోజులు గడుస్తోంది. రుతుపవనాల రాక కాస్త ఆలస్యమైనా.. క్రమంగా అన్ని చోట్లా వ్యవసాయ పనుల సందడి మొదలవుతోంది. మరి అందుకు సన్నద్ధత ఎలా ఉంది?. రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయ శాఖ వైపు నుంచి ఏర్పాట్లు ఎంత వరకు వచ్చాయి?. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు.. వాటన్నింటికి మించి పరపతి సాయం విషయంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు పరిష్కారం చూపించారా?. మరీ ముఖ్యంగా వరి రైతులకు గత సంవత్సరానికి సంబంధించిన ధాన్యం బకాయిలు చెల్లించేది ఎప్పుడు?. రైతు భరోసా కేంద్రాల నుంచి అన్నదాతలకు లభిస్తోన్న సహాయం ఎంత?. తొలికరి వేళ రైతులు, రైతుసంఘాల నుంచ వస్తోన్న సూటి ప్రశ్నలు ఇవే. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.