Chalo Vijayawada: మారువేషాల్లో 'చలో విజయవాడ'కు.. నెరవేరిన లక్ష్యం - చలో విజయవాడకు ఉద్యోగుల వేశాలు
🎬 Watch Now: Feature Video
employees Different getups to chalo vijayawada : 'చలో విజయవాడ' కార్యక్రమానికి ఉద్యోగులు పోలీసుల కళ్లు గప్పి.. మారువేషాల్లో తరలివచ్చారు. తమ హక్కుల సాధన కోసం వివిధ వేషాల్లో విజయవాడకు చేరుకున్నారు. ఓ ఉద్యోగి బిక్షాటన చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. చలో విజయవాడ కార్యక్రమానికి వెళ్లకుండా అడ్డుకోవడంతో.. గన్నవరంలో ఉపాధ్యాయులు ఎస్ఐ కాళ్లు పట్టుకుని వేడుకున్నారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమను వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ తీరుపై ఉపాధ్యాయులు కంట తడి పెట్టుకున్నారు. మరోవైపు హెచ్ఆర్ఏ, పిట్మెంట్లలో కోత పెట్టడంపై ఉద్యోగులు చిలక జోస్యం చెప్పించుకుంటూ తమ ఆందోళన వ్యక్తం చేశారు.