Prathidwani: అవాంఛిత గర్భం తొలగింపుపై చట్టం ఏం చెబుతోంది ? - Voluntary termination of pregnancy latest news
🎬 Watch Now: Feature Video
మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీపై కీలక తీర్పు వెలువరించింది తెలంగాణ ఉన్నత న్యాయస్థానం. మైనర్ అయిన అత్యాచార బాధితురాలికి 26 వారాల గర్భాన్ని తొలగించేందుకు ప్రత్యేక పరిస్థితుల్లో ఈ అనుమతి ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అబార్షన్ నిబంధనల గడువును కూడా సడలించి అనుమతించింది. గర్భస్థ శిశువు కంటే సదరు మహిళ భవిష్యత్తే ప్రధానం అంది. ఈ నేపథ్యంలో గర్భస్రావానికి సంబంధించి ప్రస్తుతం దేశంలో ఉన్న నిబంధనలేంటి ? వాటి అమలు విషయంలో ఎదురవుతున్న ప్రత్యేక పరిస్థితులపై ఎలాంటి చర్చ అవసరం ? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.