తిరుపతిలోని ఆ ప్రాంతాల్లో ఎవరూ తిరగొద్దు! - రాష్ట్రంలో కరోనా వార్తలు
🎬 Watch Now: Feature Video
తిరుపతిలో కరోనా పాజిటివ్ కేసు నమోదైన నేపథ్యంలో ఆయా ప్రాంతాలను రెడ్ జోన్‌గా ప్రకటించి డిస్ ఇన్ఫెక్షన్ పనులు ప్రారంభించినట్లు నగరపాలక సంస్ధ కమిషనర్ గిరీషా ప్రకటించారు. నగరంలోని త్యాగరాజ నగర్, భవానీ నగర్, గాలి వీధుల్లో భద్రత కట్టుదిట్టం చేశామన్న కమిషనర్... ప్రజలు ఎవరు ఆ ప్రాంతాల్లో సంచరించకుండా నిషేధం విధించామన్నారు. దిల్లీ సహా పలు ప్రాంతాల్లో మత ప్రార్ధనల్లో పాల్గొన్న వ్యక్తులను వేగంగా గుర్తించి పరీక్షలు జరిపేందుకు కృషి చేస్తున్నామంటున్న కమిషనర్ గిరీషాతో మా ప్రతినిధి నారయణప్ప ముఖాముఖి.