ప్రతిధ్వని: ఆన్‌లైన్ మోసాల ముప్పు తప్పించుకోవడం ఎలా? - అమరావతి వార్తలు
🎬 Watch Now: Feature Video
తక్కువ పెట్టుబడితో ఎక్కువ సంపాదించవచ్చనే ఆశతో ఆన్‌లైన్ మోసాల ఉచ్చులో చిక్కుకుంటున్నారు.. నెటిజన్లు. మార్కెట్‌లో బాగా తెలిసిన కంపెనీల పేరుతో ప్రజలకు ఆశల వల విసురుతున్నారు సైబర్ మోసగాళ్లు. ఆకట్టుకునే ఆఫర్లు, వేగంగా డబ్బు సంపాధించే చిట్కాలు చెప్తామంటూ నిండా ముంచేస్తున్నారు. వందలు వేలల్లో కాదు.. లక్షల రూపాయలు పోగొట్టుకుంటున్న బాధితులు తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతం అవుతున్నారు. ఒక్క ఆన్‌లైన్ ట్రేడింగ్ అనేకాదు.. కొద్దిరోజులుగా అన్నిరకాల సైబర్ నేరాల్లో ఇదే ఉద్ధృతి. ఈ ముప్పు నుంచి గట్టెక్కడం ఎలా..? నిపుణులు ఏం చెబుతున్నారు. జనం పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.