PRATIDWANI: రాష్ట్రంలోనే అధికంగా పెట్రో ధరలు.. ఎందుకీ పరిస్థితి - pratidwani debate on petrol rates
🎬 Watch Now: Feature Video
అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్...! చుక్కలు చూపిస్తున్న పెట్రోల్, డీజిల్ ధరల్లో రాష్ట్రం సాధించిన
పురోగతి ఇది. ఒకవైపు.. కరోనా చేసిన గాయాలు. మరొకవైపు.. బతుకుల్ని దుర్భరం చేసిన పెట్రో ధరలు. ఈ పరిస్థితుల్లో ఎట్టకేలకు ఇటీవల కేంద్రం కాస్త కరుణించింది. 25 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలూ ఆ బాటలో నడిచాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం అందుకు సుతరాము ఒప్పు కోవడం లేదు. ఎవరు ఎన్ని విధాల అరిచి గీ పెట్టినా.. కేంద్రంపై ఎదురుదాడికి దిగుతోందే తప్ప.. మేమూ తగ్గిస్తాం అన్న మాటే అనడం లేదు. కర్ణాటక వంటి రాష్ట్రాలు ఏపీతో పోల్చితే మా వద్ద పెట్రోల్, డీజిల్ చౌక అని బోర్డులు పెట్టినా ప్రభుత్వపెద్దల్లో మార్పు కనిపించడం లేదు. అసలు రాష్ట్రంలో ఎందుకీ పెట్రో మంటలు. ఈ వాతల నుంచి ఊరట లభించాలంటే ఏం చేయాలి?