prathidwani : ఇంటి నుంచి ఆఫీస్ వరకు.. "ఆమె" భద్రతకు ఏదీ భరోసా? - pratidhvani debate on women safety
🎬 Watch Now: Feature Video

మహిళలపై హింసకు అంతమెక్కడ? ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు సామాజిక అత్యవసరం.
ఆమె భద్రతకు భరోసా కల్పించడం అత్యావశ్యకం. సమాజమెంత నాగరిత సంతరించుకుంటున్నా .. మనిషి ఎంత ఆధునిక పోకడలు పోతున్నా... మహిళలపై ఆగని హింసే ఇందుకు కారణం. పైగా.. ఇప్పుడీ హింస మరిన్ని రూపాల్లో మారుతోంది. భౌతికంగానే కాక... లైంగికంగా, మానసికంగా, భావోద్వేగాలు, ఆర్ధికపరమైన అనేక మార్గాల్లో.. పెరుగుతునే ఉన్నాయి.. ఆమెఅవస్థలు. చులకనగా చూడడం, అవహేళనలు చేయడమైతే సాధారణంగా మారింది. కొవిడ్ పరిస్థితుల్లో ఆ అనాగరిక పోకడల్ని మరింత పెంచాయన్నది అధ్యయనాలే చెబుతున్న నిష్ఠూర సత్యం. మహిళలపై హింస నివారణ అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా ఇదే అంశంపై చర్చను చేపట్టింది ప్రతిధ్వని.