ప్రతిధ్వని : ప్రభుత్వ బడులకు కొత్త కళ...పెరుగుతున్న ప్రవేశాలు - ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో పెరిగిన ప్రవేశాలు
🎬 Watch Now: Feature Video
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ బడులకు కొత్త కళ వస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు బాగా పెరుగుతున్నాయి. కరోనా సంక్షోభం నేపథ్యంలో ఆర్థిక భారం మోయలేక చాలామంది తల్లిదండ్రులు వారి పిల్లల్ని సర్కారు బడుల్లో చేర్పించడానికి సిద్ధం అవుతున్నారు. ఆర్థిక కారణాలతో పలు ప్రైవేటు పాఠశాలలు మూతపడడం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో చేరే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలు ఈ అవకాశాన్ని ఏవిధంగా సద్వినియోగం చేసుకోవాలి, ప్రభుత్వ పాఠశాలల పట్ల విద్యార్థులలో మరింతగా ఆసక్తిని ఏ విధంగా పెంచాలి, మౌలిక అంశాలపై దృష్టి సారించడం వంటి అంశాలకు సంబంధించి ప్రతిధ్వని చర్చను చేపట్టింది.