Prathidwani: రాష్ట్రంలో ఉపాధిహామీ బిల్లుల చెల్లింపులో తీవ్రజాప్యం - నరేగా బిల్లుల చెల్లింపులో జాప్యం
🎬 Watch Now: Feature Video
జాతీయ ఉపాధి హామీ పథకం బిల్లులు చెల్లించాలంటూ రాష్ట్రంలో ఆందోళనలు రోజురోజుకు హోరెత్తుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకూ చేసిన పనులకు కేంద్రం నుంచే భారీగా బిల్లులు రావాలని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఇదేసమయంలో ముఖ్యంగా... 2018-19 సంవత్సరానికి సంబంధించిన బిల్లుల చెల్లింపు కేంద్రంగా రేగిన వివాదమూ సద్దుమణగలేదు. ఫలితంగా.. నరేగా బిల్లుల రాక ఆర్థికనష్టాల్లో కూరుకుపోయామని గుత్తేదార్లు ఆవేదన వ్యక్తం చేస్తుంటే.. విచారణల పేరుతో తమను ఇబ్బందులు పెడుతున్నారని మాజీ సర్పంచులు ఆందోళన నిర్వహిస్తున్నారు. నరేగా బిల్లుల విషయంలో.. అసలు ఈ పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయి. ఎప్పటిలోపు బకాయిలు పూర్తయ్యే అవకాశం ఉంది. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.