ప్రతిధ్వని: కరోనా విపత్కర పరిస్థితుల్లో పరీక్షలు అవసరమా..?
🎬 Watch Now: Feature Video
దేశం కరోనా సెకండ్ వేవ్ పంజాతో గజగజలాడుతోంది. లెక్కకు మించిన కేసులు, అంచనాలకు అందని మరణాలు తీరని వేదన కలిగిస్తున్నాయి. విధి లేని పరిస్థితుల్లో.. ప్రజల భద్రతకే ప్రాధాన్యం ఇస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుమికూడే వీలున్న దేనికీ అనుమతించే సాహసం చేయడం లేదు. ఆ క్రమంలోనే విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా వార్షిక పరీక్షలపైనా వాయిదా, రద్దు నిర్ణయాలు వెలువడ్డాయి. CBSE, ICSE పది పరీక్షలు రద్దు చేశాయి. ప్లస్ టూ పరీక్షలు వాయిదా వేశాయి. పొరుగురాష్ట్రం తెలంగాణలోనూ అంతే. పది, ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రద్దు, ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల వాయిదా నిర్ణయం తీసుకున్నారు. కానీ ఏది ఏమైనా పరీక్షలు జరిపించి తీరామన్న ఏపీ ప్రభుత్వం పట్టుదలతోనే ఇప్పుడు కలవరం మొదలయింది. కోర్టు వరకు వెళ్లింది ఈ వివాదం. అసలు ఈ ప్రాణాంతక పరిస్థితుల్లో పరీక్షలు ఎందుకు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.