ప్రతిధ్వని: కరోనాపై అపోహలు పిల్లల పాలిట శాపంగా మారొద్దంటే ఏం చేయాలి? - etv bharat Debate on corona effect on children
🎬 Watch Now: Feature Video
తరుముకొస్తున్న కరోనా సంక్షోభం పిల్లల ఆరోగ్యానికి ప్రాణాంతక సవాళ్లు విసురుతుందన్న అంచనాలు కలవరపెడుతున్నాయి. మొదటి వేవ్‌లో పిల్లల్ని అంటీముట్టనట్లున్న కరోనా.. రెండోవేవ్‌లో డేంజర్ బెల్స్ మోగించింది. మూడో వేవ్ పిల్లల ఆరోగ్యాన్ని కకావికలం చేస్తుందన్న విశ్లేషణలు ఇప్పుడు గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి. కరోనా సృష్టిస్తున్న కల్లోలం నుంచి రాబోయే రోజుల్లో పిల్లల్ని రక్షించుకోవడం దేశం ముందున్న ప్రధాన సవాలు. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రచిస్తున్న ముందస్తు ప్రత్యేక ఆరోగ్య ప్రణాళికలు ఏంటి? తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కరోనాపై వస్తున్న అపోహలు పిల్లల పాలిట శాపంగా మారొద్దంటే ఏం చేయాలి? ఈ అంశంపైనే ఈవాళ్టి ప్రతిధ్వని.