ప్రతిధ్వని : ప్రకృతి ప్రకోపం హెచ్చరికల్ని గుర్తిస్తున్నామా?
🎬 Watch Now: Feature Video
వాతావరణంలో పెనుమార్పులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, సునామీలు, వరదలు, అతివృష్టి, అనావృష్టి, జీవావరణ సమతుల్యతలో లోపం. అంతేనా.. పంచభూతాలు కాలుష్యం బారిన పడి భూగోళం ఉక్కిబిక్కిరవుతోంది. ప్రజారోగ్యం ప్రత్యక్షంగా, పరోక్షంగా దెబ్బతినడంలో వైపరీత్యాలు కాదనలేని ప్రభావం చూపిస్తున్నాయి. ప్రకృతి విధ్వంసం మరెన్నో విపరిణామాలకు దారితీస్తోంది. అడుగు పెట్టిన చోటల్లా విధ్వంసంతో మనిషి తాను తీసుకున్న గోతిలో తానే పడుతున్నాడు. కరోనా వంటి మహమ్మారి వైరస్‌లు విరుచుకుపడడానికి- ప్రకృతి ప్రకోపానికి మధ్య సంబంధాన్ని అర్థం చేసుకోవడం ఎలా? ఈ నేపథ్యంలోనే రీ ఇమాజిన్, రీ క్రియేట్, రిస్టోరేషన్ అంటూ మేలుకొలుపు పాడుతోంది.. ఈ ఏడాది పర్యావరణ దినోత్సవ నినాదం. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.