ప్రతిధ్వని: ఆర్థిక సర్వే ఏం చెప్పింది..బడ్జెట్ ఎలా ఉండబోతుంది ? - ప్రతిధ్వని తాజా
🎬 Watch Now: Feature Video
2021 ఆర్థిక సర్వేను ఇవాళ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ముందుకు తీసుకువచ్చింది. రాబోయే బడ్జెట్‌కు సంకేతంగా ప్రతిసారి కూడా బడ్జెట్‌కు ముందు ఆర్థిక సర్వేను పార్లమెంట్లో ప్రవేశపెట్టడం ఆనవాయితీ. అయితే మరో రెండు రోజుల్లో రానున్న బడ్జెట్ ఎలా ఉండబోతోందన్న సంకేతాలను ఆర్థిక సర్వే అందించింది. ఏడాది కాలంగా జరిగిన ఆర్థిక కార్యకలపాలపై ఉన్నటువంటి విధాన పత్రం ద్వారా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని., ఆశావాద ధృక్పథంతోనే ముందుకు వెళ్లబోతున్నామని ఆర్థిక సర్వే ప్రకటించింది. ఆర్థిక సర్వే ద్వారా ముఖ్యంగా వచ్చే ఏడాదిలో దాదాపు 11 శాతం వృద్ధి రేటు నమోదు కావొచ్చు అనే అంచనాలున్న పరిస్థితుల్లో బడ్జెట్ ఎలా ఉండబోతుందనే అంశంపై ప్రతి ధ్వని చర్చను చేపట్టింది.