రాశి ఫలం: కర్కాటకం - ఉగాధి రాశి ఫలాలు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-6529548-435-6529548-1585053716113.jpg)
ఆదాయం: 11, వ్యయం: 8, రాజపూజ్యం: 5, అవమానం: 4
కర్కాటక రాశివారికి ఈ ఏడాది ఫలితాలు బాగున్నాయి. సాంకేతిక వ్యాపార రంగాల్లో శ్రమకు తగిన ఫలితం వస్తుంది. వ్యవసాయదారులు కాస్త శ్రమించినప్పటికీ.. మంచి ఫలితాలు సాధిస్తారు. అందరూ మీతో సన్నిహితంగా మెలుగుతారు. ఈ రాశివారు కలలు కని వాటిని సాకారం చేసుకుంటారు. సాహిత్యం, విద్య, పరిశోధన రంగంలో చేసిన కృషికి తగిన గుర్తింపు, గౌరవం లభిస్తుంది. స్థిరాస్తుల వ్యవహారాలు అనుకూలిస్తాయి. కాంట్రాక్టులు, సబ్ కాంట్రాక్టులు, లైసెన్సులు, లీజులు లాభిస్తాయి. ప్రతి చిన్న విషయంలో పలుకుబడి ఉపయోగించాల్సి వస్తుంది. రాజకీయ నాయకుల జోక్యం కూడా అనివార్యమవుతుంది. జీవితం భాగస్వామితో సఖ్యత చాలా విషయాలను ప్రభావితం చేస్తుంది. నిరుద్యోగులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. వ్యక్తిగత, వత్తిపరమైన రహస్యాలు బయటకు తెలియడం కాస్త ఇబ్బందికరంగా మారుతుంది.