వీడియో: ఏకతాటిపైకి ఆంధ్రా జనం... ఊరూవాడా నిశ్శబ్దం - ఆంధ్రాలో జనతా కర్ఫ్యూ న్యూస్
🎬 Watch Now: Feature Video
రాష్ట్రమంతా ఒకటే మాట...అందరిదీ ఒకే బాట. ఆంధ్రులంతా ఏకతాటిపైకి వచ్చారు. కరోనా మహమ్మారిపై సాగిస్తున్న పోరుకు నేను సైతం అంటూ ప్రతి ఒక్కరూ కాలు కదపకుండా ఇంటికే పరిమితమయ్యారు. 12 గంటలపాటు స్వచ్ఛందంగా నిర్బంధం విధించుకొని దేశానికే మేలు చేసే యజ్ఞంలో పాలుపంచుకున్నారు. ప్రధాన నగరాలతో పాటు పల్లెలు, పట్నాల్లోని దారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. బస్సులు, లారీలు, వాహనాలు ఆగిపోయాయి. కరోనాను కట్టడి చేద్దాం- వైరస్ వ్యాప్తి చెందకుండా యుద్ధం చేద్దాం అంటూ జనతా కర్ఫ్యూ పిలుపు.. దేశానికి మేలిమలుపై నిలిచింది.
Last Updated : Mar 22, 2020, 11:15 PM IST