అన్నదాతల ఆగ్రహ జ్వాలలు...ఉద్రిక్తంగా జైల్ భరో - అమరావతి ఐకాస తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video

అమరావతి రైతులను అక్రమంగా అరెస్టు చేసి... వారికి సంకెళ్లు వేసి తరలించటానికి నిరసనగా అన్నదాతలు ఆగ్రహం వెలిబుచ్చారు. మహిళలు సివంగులై గర్జించారు. ముందుగా చెప్పినట్లే గుంటూరు జిల్లా జైలును ముట్టడించారు. పోలీసుల ఆంక్షలు, చెక్‌పోస్టులు వారిని అడ్డుకోలేకపోయాయి. పోలీసుల వలయాలు ఛేదించుకుని జైలు వద్దకు చేరుకున్నారు. జైలు లోపలకు వెళ్లేందుకు యత్నించిన రైతు ఐకాస నేతలు, రాజకీయపక్షాల నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో జైలు బయట వాతావరణం రణరంగాన్ని తలపించింది.