సీతారాముల తలంబ్రాలకు శ్రీకారం.. కాడి పట్టిన రాంబంట్లు - east godavari
🎬 Watch Now: Feature Video
భద్రాద్రి, ఒంటిమిట్టలో కన్నుల పండుగగా జరిగే సీతారాముల కల్యాణానికి కోటి తలంబ్రాలను సిద్ధం చేసేందుకు సాగు ప్రారంభమయ్యింది. తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం అచ్యుతాపురం గ్రామంలో రామాయణ వేషధారణలో దుక్కి దున్ని సాగుప్రారంభించారు. భద్రాద్రి శ్రీరాముని సన్నిధి నుంచి తీసుకు వచ్చిన వరి విత్తనాలను పొలంలో ఉంచి పూజలు చేశారు. శ్రీరాముడు, ఆంజనేయుడు, సుగ్రీవుడు, అంగదుడు, జాంబవంతుడి వేషాదారణలో వరి విత్తనాలు చల్లారు. కోరుకొండ శ్రీకృష్ణ చైతన్య సంఘం నిర్వాహకులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.