ఉద్యోగాల కోసం నిరుద్యోగుల ఎదురుచూపులు.. ప్రభుత్వం చేస్తున్నప్రయత్నాలేంటి? - PRATHIDWANI debate on unemployment in andhra pradesh
🎬 Watch Now: Feature Video
Unemployment in Andhra pradesh: రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగుల్లో అసంతృప్తి రగులుకుంటోంది. డిగ్రీలు, పీజీ పట్టాలు చేతికొచ్చినా.. చేసేందుకు కొలువులు దొరకని పరిస్థితులు యువత, విద్యార్థులను నిస్పృహలోకి నెట్టేస్తున్నాయి. ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వం ఇస్తున్న హామీలు లక్షలాది నిరుద్యోగ సైన్యానికి భరోసా కల్పించలేకపోతున్న పరిస్థితి. దీనికితోడు ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు.., ఇప్పటికే ప్రకటించిన ఉద్యోగ నియామకాల ప్రక్రియలో ఎడతెగని జాప్యం... నిరుద్యోగ యువతలో ఆగ్రహావేశాలకు ఆజ్యం పోస్తోంది. ఈ నేపథ్యంలో విద్యార్థి, యువజన సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిచ్చాయి. అసలు నిరుద్యోగుల డిమాండ్లు ఏంటి..? ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం చేస్తున్నప్రయత్నాలేంటి? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని...