ప్రతిధ్వని: ఎన్నికలు.. డిజిటల్ పర్వం!
🎬 Watch Now: Feature Video
కరోనా ప్రభావం ప్రతి రంగంపై పడింది. ఈ క్రమంలో భారత ఎన్నికల సంఘం సంస్కరణలకు సిద్ధమైంది. త్వరలో జరగనున్న బిహార్ ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తున్న ఈసీ.. కీలక నిర్ణయాలు తీసుకుంది. ఓటర్లు భౌతిక దూరం పాటించేలా పోలింగ్ కేంద్రాలను రెట్టింపు చేస్తోంది. ఒక్కో కేంద్రంలో వెయ్యి మందికి అవకాశం కల్పిస్తోంది. 65 ఏళ్లు దాటిన వారికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే సదుపాయం కల్పించనుంది. కరోనా బాధితులు, ఐసోలేషన్ వార్డులో ఉన్న వారు కూడా పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే అవకాశం కల్పించనుంది. అటు పార్టీలు కూడా ప్రచారానికి డిజిటల్ వేదికలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఆధునిక సాంకేతికత బాట పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ.. ప్రచారంలో రానున్న మార్పులపై ఈరోజు ప్రతిధ్వని చర్చ.