మాస్క్ పెట్టుకోమన్నందుకు పూజారిపై దాడి... గుంటూరులో ఘటన - దేవరంపాడులో దేవాలయం తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
దేవాలయంలో పూజారి పై భక్తులు దాడి చేసిన ఘటన గుంటూరు జిల్లా రాజుపాలెం గ్రామంలో జరిగింది. దేవరంపాడు కొండపై ఉన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు సాంబశివరావు అనే వ్యక్తి మాస్క్ లేకుండా గుడిలోకి వెళ్లాడు. మాస్క్ ధరించి లోపలకు రావాలని పూజారులు చెప్పగా... మీరు ఎవరూ చెప్పేది అంటూ సాంబశివరావు దౌర్జన్యం చేశాడు. ఇదేంటని ప్రశ్నించిన పూజారిపై దాడికి పాల్పడ్డాడు. జరిగిన విషయాన్ని పూజారులు పోలీసులకు తెలిపగా... సాంబశివరావు తన కారులో పరారయ్యారు. కేసు నమోదు చేసిన రాజుపాలెం పోలీసులు విచారణ చేపట్టారు.