యోగాసనాలతో కరోనాపై అవగాహన - Awareness on Corona with Yogasanas news
🎬 Watch Now: Feature Video

కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఈ మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు పలువులు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇప్పటికే కవులు, కళాకారులు తమ ఆటపాటలతో కోరనా వైరస్ గురించి ప్రజలను చైతన్యం పరుస్తున్నారు. విజయవాడకు చెందిన ఓ యోగా గురువు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కరోనాపై అవగాహన కల్పిస్తూ వచ్చిన ఓ పాటను నేపథ్యంగా తీసుకొని తన శిష్య బృందంతో కలిసి యోగాసనాలు వేస్తూ అవగాహన కల్పిచే ప్రయత్నం చేశారు.