ప్రతిధ్వని : ఐపీఎల్ సమరం... క్రీడాభిమానులకు సంబరం - ipl latest updates
🎬 Watch Now: Feature Video
ప్రపంచ యవనికపై తనదైన ముద్ర వేసిన ఐపీఎల్.... క్రికెట్ అభిమానులకు అంతులేని ఆనందాన్ని అందించేందుకు సిద్ధమైంది. ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా యూఏఈలో రేపటి నుంచి ఐపీఎల్-13 సీజన్ ప్రారంభం కానుంది. 46 రోజుల పాటు సాగే ఈ మెగా టోర్నీకి 8 జట్లు సన్నద్ధమయ్యాయి. ఈ హోరాహోరీ సమరంలో ఆఖరి బంతి వరకూ ఉత్కంఠరేపే పోరాటాలు, విధ్వంసక ఇన్నింగ్సులు, కళ్లు చెదిరే ఫీల్డింగ్ విన్యాసాలు క్రికెట్ ప్రియులను అలరించబోతున్నాయి. అయితే స్టేడియాల్లో ప్రేక్షకులు లేకపోవటం పెద్ద లోటుగా కన్పిస్తోంది. ఈ నేపథ్యంలో ముచ్చటగా మూడు గంటల పాటు అభిమానుల్ని మంత్రముగ్ధుల్ని చేసే ఐపీఎల్ క్రీడా సమరంపై ప్రతిధ్వని చర్చ చేపట్టింది.