Prathidwani: జిల్లాల్లో మార్పులతో ప్రజలకు ఎదురయ్యే ఇబ్బందులేంటి ?.. ఎలా పరిష్కరిస్తారు..? - ప్రతిధ్వని
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-14883692-842-14883692-1648653680003.jpg)
కొత్త జిల్లాల అవతరణకు రాష్ట్ర ప్రభుత్వం ముహుర్తం ఖరారు చేసింది. ఏప్రిల్ 4 ఉదయం 9-05 నుంచి 9-45 గంటల మధ్య జిల్లాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి ప్రభుత్వానికి ఇప్పటి వరకు 16,600 పైచిలుకు అభ్యంతరాలు అందాయి. అలాగే సూచనలు, సలహాలు కూడా వచ్చాయి. ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని తుది నోటిఫికేషన్ జారీ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. అయితే కొన్ని కీలకమైన అంశాల్లో మాత్రం ఒక నిర్ణయానికి రాలేక పోతోంది. సిబ్బంది విభజన, కొత్త జిల్లాలకు పరిపాలన భవనాలు, విధులు, వనరుల విభజన వంటి అంశాలు ఇంకా కొలిక్కి రాని పరిస్థితి ఉంది. మరోవైపు కొత్త జిల్లాల కోసం అనేక చోట్ల ప్రజలు నిరసన తెలుపుతూనే ఉన్నారు. ఈ అంశాలపై నేటి ప్రతిధ్వని ప్రత్యేక చర్చ.
Last Updated : Feb 3, 2023, 8:21 PM IST