Prathidwani: ఆశాలు, అంగన్‌వాడీల ఆందోళనలకు కారణమేంటి? నాడు జగన్ ఏ హామీలిచ్చారు? - Asha Anganwadis protest news
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-14540298-496-14540298-1645544120911.jpg)
కనీస వేతనం పెంపు, కొవిడ్ మృతులకు పరిహారం చెల్లింపు, ఉద్యోగ విరమణ లాంటి డిమాండ్లతో అంగన్వాడీలు, ఆశా వర్కర్లు రోడ్డెక్కారు. అతి తక్కువ వేతనం ఇస్తున్న తమకు ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు అందించాలనేది తమ కనీస కోరిక అంటున్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తుంటే.. రేషన్ కార్డులు తొలగిస్తామని ప్రభుత్వం చెబుతోంది. తమ డిమాండ్లు వినిపించేందుకు రోడ్లపైకి వచ్చినటువంటి ఆశాలు, అంగన్వాడీ కార్యకర్తలను ప్రభుత్వం నిర్భందించింది. కలెక్టరేట్లకు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేసింది. అసలు వీరు ఎందుకు ఆందోళన బాట పట్టాల్సి వచ్చింది ? విధులు వీడి వీధుల్లోకి ఎందుకు వచ్చారు ? ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమయ్యోయనే అంశంపై ఇవాళ ప్రతిధ్వని ప్రత్యేక చర్చను చేపట్టింది.
Last Updated : Feb 3, 2023, 8:17 PM IST