నిధుల దారి మళ్లింపుపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రధాని మోదీ ప్రశ్నించాలి: వైవీబీ రాజేంద్రప్రసాద్ - ఏపీలో పంచాయతీ నిధులు మళ్లింపు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 25, 2023, 5:56 PM IST
YVB Rajendra Prasad Fires on CM Jagan: రాష్ట్రంలో సర్పంచుల రెండో దశ ఉద్యమం చేపట్టనున్నట్లు పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర వ్యవస్ధాపక అధ్యక్షుడు బాబు రాజేంద్రప్రసాద్ తెలిపారు. తిరుపతిలో ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం, పంచాయితీరాజ్ చాంబర్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర కమిటీ సమావేశాలలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర పర్యటనకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ.. కేంద్రం నిధుల మళ్లింపుపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించాలని విజ్ఞప్తి చేశారు.
ఉపాధి హామీ నిధులు, 14, 15వ ఆర్థిక సంఘం నిధులు, జలజీవన్ తదితర కేంద్రం నిధులను ముఖ్యమంత్రి జగన్ దారి మళ్లించారని ఆరోపించారు. కేంద్రం నిధులను మళ్లించి సర్పంచ్ ల ఖాతాలను ఖాళీ చేశారన్నారు. గ్రామాల్లో మౌళిక సదుపాయాలు లేక గ్రామీణ ప్రజలు పట్టణాలకు వలస పోతున్నారన్నారు. కేంద్ర బృందం పర్యటించి రాష్ట్ర ప్రభుత్వ తప్పిదాలను గుర్తించిందన్నారు. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా పంచాయతీ రాజ్ వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని ఆయన మండిపడ్డారు. మహాత్మాగాంధీ కలలు కన్న గ్రామస్వరాజ్యాన్ని జగన్మోహన్ రెడ్డి పాలనలో వాలంటీర్లకు దారాదత్తం చేశారన్నారు.
AP Sarpanch Association President Lakshmi Comments: మూడేళ్లుగా రాజీలేని పోరాటం చేసినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షురాలు లక్ష్మి మండిపడ్డారు. ఉద్యమాలపై సమీక్ష చేసి రెండో విడత పోరాటాలు ఉద్ధృతం చేస్తామని లక్ష్మి తెలిపారు.