'వైఎస్సార్సీపీ పాలనలో అన్యాయం జరిగింది - అందుకే రాజీనామా చేస్తున్నా' - యువజన నాయకుడు వాసంశెట్టి సుభాష్
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 18, 2024, 1:09 PM IST
YSRCP Youth Leader Vasamsetti Subhash Resign: కోనసీమ జిల్లా అమలాపురం వైఎస్సార్సీపీ యువజన నాయకుడు వాసంశెట్టి సుభాష్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. మంత్రి విశ్వరూప్, మరికొంత మంది సొంత పార్టీ నేతలు ఇబ్బంది పెట్టారని, అలాంటి వారికి టికెట్ ఇవ్వొద్దని అగ్ర నాయకత్వానికి చెప్పినా పట్టించుకోలేదని అందుకే వైయస్ఆర్సీపీకి రాజీనామా చేస్తున్నానని సుభాష్ వెల్లడించారు.
Subhash Expressed Dissatisfaction Towards YSRCP: కోనసీమ జిల్లా పేరు మార్పు విషయంలో జరిగిన అల్లర్ల కేసులో తన సామాజిక వర్గాన్ని ప్రభుత్వం ఇబ్బందికి గురి చేసిందని సుభాష్ ఆవేదన వ్యక్తం చేశారు. అమాయకులపై కేసులు ఎత్తివేయాలని కోరగా వైసీపీ జిల్లా అధ్యక్షుడు, స్థానిక నేతలు అడ్డుపడ్డారని ఆరోపించారు. సుమారు పది సంవత్సరాల పైగా వైయస్ఆర్సీపీకి సేవ చేశానని సుభాష్ తెలిపారు. బుధవారం ఉమ్మడి గోదావరి జిల్లాలకు చెందిన నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి, అనంతరం పార్టీకి రాజీనామా చేశారు. తరువాత ఏ పార్టీలో చేరేది తన సంఘ నాయకులతో చర్చించిన తరువాత వెల్లడిస్తానని సుభాష్ పేర్కొన్నారు.