YSRCP Workers Blocked Minister Peddireddy : మంత్రి కాన్వాయ్​ని అడ్డుకున్న వైసీపీ కార్యకర్తలు.. ఈడ్చి పడేసిన పోలీసులు - పెద్దిరెడ్డి కాన్వయ్​ని అడ్డుకున్న ప్రజలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 13, 2023, 12:35 PM IST

YSRCP Workers Blocked Minister Peddireddy Ramachandra Reddy Convoy on National Highway : ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అధికార వైసీపీలో అసమ్మతి రాగాలు వినిపిస్తున్నాయి. వైసీపీలో వర్గ విభేదాలు రోజురోజుకు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. తాజాగా అసమ్మతి కార్యకర్తలు మంత్రి పెద్దిరెడ్డి కాన్వాయ్‌ను అడ్డుకొని.. ఆందోళన చేపట్టారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలంలో వైఎస్సార్సీపీ వర్గ విభేదాలు బహిర్గతం అయ్యాయి. మండలానికి చెందిన ముఖ్యనేత దండపాణికి వ్యతిరేకంగా మరో వర్గం ఆందోళనకు (YSRCP Workers Protest in Santhipuram) దిగింది. మోరసనపల్లిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన నేపథ్యంలో 5 గ్రామాలకు చెందిన వైసీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకుని మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. దండపాణికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ప్రభుత్వస్థలాన్ని అధికార పార్టీ నాయకుడు ఆక్రమించుకున్నారని  గ్రామాలకు చెందిన ప్రజలు, వైసీపీ కార్యకర్తలు ఆరోపించారు. ప్రభుత్వ స్థలంలో అధికార పార్టీ నేత ఆక్రమణలను అరికట్టాలంటూ వారు ఆందోళనకు దిగారు. ఇంతకుముందే తమ సమస్యను నియోజకవర్గ నాయకుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో పెద్దిరెడ్డి ఎదుట ఆయా గ్రామాల వైసీపీ కార్యకర్తలు నిరసనకు దిగారు. 

ఈ క్రమంలో కుప్పం- పలమనేరు జాతీయ రహదారిపై అసమ్మతి నేతలు బైఠాయించారు. మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకున్న వైసీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకుని ఈడ్చి పడేశారుసమస్యను వినకుండానే మంత్రి వెళ్ళిపోవడం పట్ల మండల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి గుడుపల్లి "గడపగడపకు మన  ప్రభుత్వం కార్యక్రమానికి" వెళ్లారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.