Thaman Musical Night in Vijayawada: తలసేమియా బాధితులకు అండగా నిలిచే లక్ష్యంతో విజయవాడ వేదికగా యుఫోరియా మ్యూజికల్ నైట్ నిర్వహిస్తున్నట్టు ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి పేర్కొన్నారు. హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఈ మేరకు నిర్వహించిన కార్యక్రమంలో ప్రముఖ సంగీత దర్శకుడు తమన్, ట్రస్ట్ సీఈఓ రాజేంద్ర పాల్గొన్నారు. ఫిబ్రవరి 15న ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం లో ఈ కన్సర్ట్ ని నిర్వహించనున్నారు.
తమన్ ఆధ్వర్యంలో ప్రముఖ డ్రమ్స్ ప్లేయర్ శివమణి సహా దాదాపు 50 మంది కళాకారులు యుఫోరియాలో ఆడిపాడి ఆకట్టుకోనున్నారు. ఈ కార్యక్రమంలో దాదాపు లక్ష మంది పాల్గొంటారని అంచనా. బుక్ మై షో లో టికెట్స్ అందుబాటులో ఉన్నాయని ఈ సందర్బంగా పేర్కొన్న నారా భువనేశ్వరి, ఈ షో ద్వారా వచ్చిన డబ్బుని తలసేమియా కేంద్రాల ఏర్పాటుకు వినియోగిస్తామన్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా వస్తారని పేర్కొన్న భువనేశ్వరి, చంద్రబాబు, పవన్ కల్యాణ్ లాంటి ప్రముఖులు కూడా కుటుంబ సమేతంగా టికెట్స్ బుక్ చేసుకుని తలసేమియా బాధితులకు అండగా నిలవాలని కోరారు.