జగనన్న కార్యక్రమాలకు జనాలను తరలించడానికే మేము ఉన్నామా! వచ్చే ఎన్నికల్లో అభివృద్దిపై ప్రజలకు ఏం చెప్పాలి? - ma nammakam nuvve jagan program news
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/03-11-2023/640-480-19935730-thumbnail-16x9-ysrcp-workers-angry-with-mla.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 3, 2023, 10:45 PM IST
YSRCP Workers Angry With MLA: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అసంతృప్తికి గురవుతున్నారు. నాలుగున్నరేళ్లుగా పార్టీ కోసం కష్టపడి పని చేసిన కార్యకర్తలకు పార్టీలో విలువ ఇవ్వడం లేదని ఆవేదన చెందుతున్నారు. జగనన్న కార్యక్రమాలకు జనాలను తరలించడానికే కార్యకర్తలను వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Ma Nammakam Nuvve Jagan Program: అనకాపల్లి జిల్లా కోటవురట్లలో శుక్రవారం 'మా నమ్మకం నువ్వే జగన్' కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు, నియోజకవర్గ ఇంఛార్జ్ తిప్పల గురుమూర్తి హాజరయ్యారు. ఈ క్రమంలో కార్యక్రమానికి విచ్చేసిన కొంతమంది కార్యకర్తలు.. నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కష్టపడి పని చేసిన కార్యకర్తలకు పార్టీలో విలువ ఇవ్వడం లేదని అసంతృప్తికి గురయ్యారు. జగనన్న కార్యక్రమాలకు జనాలను తరలించడానికే తమను (కార్యకర్తలు) వాడుకుంటున్నారని ఆవేదన చెందారు. పార్టీ అధికారంలోకి వచ్చి, నాలుగున్నరేళ్లు అవుతున్నా.. ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదని వాపోయారు. వచ్చే ఎన్నికల్లో ప్రజల వద్దకు వెళ్లి ఏమని చెప్పాలి..?, ఏం అభివృద్ది చూపి ఓట్లు అడగాలి..? అని ప్రశ్నించారు.