వైసీపీ బస్సు యాత్రకు స్పందన కరవు - నేతలు మాట్లాడుతుండగానే ఇంటిముఖం - వైసీపీ బస్సు యాత్రపై తేనెటీగలు దాడి
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 24, 2023, 9:32 PM IST
|Updated : Nov 25, 2023, 6:24 AM IST
YSRCP Samajika Sadhikara Bus Yatra: నంద్యాల జిల్లా ఆత్మకూరులో వైసీపీ నిర్వహించిన సామాజిక సాధికార బస్సు యాత్రకు ప్రజల నుంచి స్పందన కరవు అవడంతో మంత్రులు అసహనం వ్యక్తం చేశారు. జనాలను వాహనాల్లో భారీగా తరలించినప్పటికీ సభ ప్రారంభమైన కొద్దిసేపటికే అంతా వెనుదిరిగారు. సభలో వైసీపీ నేతలు మాట్లాడుతుండగానే.. భారీగా జనం ఇంటిముఖం పట్టారు. జనం లేకపోవడంతో శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి తన ప్రసంగం మధ్యలోనే ఆపేశారు. బస్టాండ్ సమీపంలో గల కేజీ రహదారిపై సభ ఏర్పాటు చేశారు. సభ కోసం ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Bees Attack on YCP Bus Yatra: మరోవైపు సభకు వెళ్లి వస్తున్న ప్రజలకు ఊహించని పరిణామం ఎదురైంది. గౌడ్ సెంటర్ వద్ద ఒక్కసారిగా తేనెటీగలు దాడులు చేయడంతో వారంతా పరుగులు తీశారు. తేనెటీగల దాడిలో సుమారు 50 మంది గాయపడ్డారు. వీరిని ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన నుంచి మంత్రులు, నాయకులు సురక్షితంగా బయటపడ్డారు.