YSRCP MLA Dharmana Krishnadas: సమస్యలపై నిలదీసిన గ్రామస్థులు.. 'ఓట్లు వేయకండి' అన్న వైసీపీ ఎమ్మెల్యే.. వీడియో వైరల్ - YSRCP MLA Dharmana Krishnadas comments
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 19, 2023, 6:55 PM IST
YSRCP MLA Dharmana Krishnadas: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం రావులవలసలో నిర్వహించిన 'జగనన్న సురక్ష' కార్యక్రమంలో పాల్గొన్న.. మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌కు ప్రజల నుంచి నిరసన సెగ ఎదురైంది. తెలుగుదేశం ప్రభుత్వంలో మంజూరైన రహదారి నిర్మాణం పనులు ఇప్పటికీ ఎందుకు ప్రారంభం కాలేదని గ్రామస్థులు ఆయనను నిలదీశారు.
Dharmana Krishnadas Fire on Villagers: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'జగనన్న సురక్ష' కార్యక్రమంలో పాల్గొంటున్న మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులకు తిప్పలు తప్పటం లేదు. గ్రామాల్లో, పట్టణాల్లో నెలకొన్న పరిస్థితులపై మహిళలు, స్థానికులు నాయకులను నిలదీస్తున్నారు. తాజాగా రావులవలసలో పర్యటించిన మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌కు ప్రజల నుంచి తీవ్రమైన నిరసన సెగ తగిలింది. వంశధార కాల్వపై ఉన్న వంతెన కుప్పకూలిపోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మహిళలు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ వర్గీయులు, గ్రామస్థుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. గ్రామస్థుల తీరుపై ఆగ్రహించిన ధర్మాన కృష్ణదాస్.. తనకు ఓట్లు వేయొద్దు అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.