విజయవాడలో వైఎస్సార్సీపీ హైడ్రామా - రోడ్డుపై బైఠాయించి కార్యకర్తల ఆందోళన
🎬 Watch Now: Feature Video
Vijayawada YSRCP Leaders Protest: సీట్ల మార్పులు వైఎస్సార్సీపీలో అగ్గి రాజేస్తోంది. అనాలోచిత నిర్ణయాలు, చేష్టలతో ఏర్పడిన ప్రజా వ్యతిరేకతను ఎమ్మెల్యేలపైకి బదిలీ చేసేందుకు సీఎం జగన్ తీవ్ర కసరత్తు చేస్తున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల్ని ఇష్టానుసారం మార్చేస్తూ వారితో బంతాట ఆడుతున్నారు. దీంతో పార్టీ నేతలు, అభిమానులు, కార్యకర్తల నుంచి తీవ్ర వ్యతిరేకత ఏర్పడుతోంది. విజయవాడలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఇంఛార్జిగా వెల్లంపల్లి శ్రీనివాస్‌ను నియమించడంపై వైఎస్సార్సీపీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బందర్ రోడ్డుపై బైఠాయించి పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు అధిష్టానం మొండిచెయ్యి చూపడం దారుణమని వైఎస్సార్సీపీ కార్యకర్తలు మండిపడ్డారు. పార్టీ శ్రేణులు మల్లాది విష్ణు నివాసానికి చేరుకుంటున్నారు. అనంతరం బందర్ రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. పార్టీ తీసుకున్న నిర్ణయానికి ప్రతి ఒక్క కార్యకర్త కట్టుబడి ఉండాలని ఆందోళన చేస్తున్న కార్యకర్తలను ఎమ్మెల్యే మల్లాది విష్ణు సముదాయించారు.