Girl Harassment In Tirupathi: హోం కేర్ సర్వీస్ కేర్లో ఉద్యోగమంటూ బాలికను లైంగికంగా, శారీరికంగా వేధించాడు ఒక ఉన్మాది. ఈ ఘటన విజయవాడలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దాదాపు 4 నెలల పాటు కష్టాలు భరించిన బాలిక ఉద్యోగం చేయలేనంటూ ఇంటికి వచ్చేసి కన్నతల్లికి విషయం చెప్పి కన్నీటిపర్యంతమైంది.
ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి: విజయవాడలో ఓ బాలిక ఇంటర్ చదువుతూ మానేసింది. బీఆర్టీఎస్ రోడ్డులోని ఒక హోంకేర్ సర్వీసులో ఈ ఏడాది జూన్ నెలలో రూ. 25 వేల వేతనానికి ఉద్యోగంలో చేరింది. ఉద్యోగం ఎలా చేయాలో పూర్తిగా తెలుసుకున్న తరువాత తిరుపతిలో విధులు నిర్వర్తించాలంటూ అక్కడకు పంపించారు. అయితే అక్కడ ఎండీగా ఉన్న వ్యక్తి ఆమెను శారీరకంగా వేధించేవాడని బాలిక తెలిపింది. గ్లాసులో మద్యం కలిపి ఇవ్వమని, కాళ్లు నొక్కాలని వేధించేవాడని, ఒకవేళ చేయనంటే నిద్రపోతున్న తనను కాళ్లతో తన్ని నిద్ర లేపేవాడని కన్నీటి పర్యంతమైంది.
హాస్టల్ ముసుగులో బాలికలపై లైంగిక దాడి - ముగ్గురు అరెస్ట్ - sexual harassment case in eluru
కూతురుతో మాట్లాడనిచ్చేవారు కాదు: తిరుపతిలో ఉన్న తమ కుమార్తెతో మాట్లాడేందుకు ప్రయత్నించినా అక్కడి వారు మాట్లాడించేవారు కాదని బాలిక తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సెప్టెంబర్ నెలలో వరదలు వచ్చినప్పుడు బాలికను ఇంటికి పంపించమని అడిగితే నెలన్నర తరువాత పంపించారని తల్లి చెబుతున్నారు. ఆ తరువాత ఒకరోజు ఉద్యోగానికి వెళ్లనంటూ బాలిక వేధింపుల గురించి చెప్పడంతో ఈ విషయం వెల్లడైంది.
వరంగల్లో ఫార్మసీ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం - Gang Rape On Pharmacy Student
పోలీసులకు ఫిర్యాదు చేసినా.. జరిగిన దారుణంపై తాము ముందుగా సూర్యాపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని తల్లిదండ్రులు తెలిపారు. అయితే ఫిర్యాదు చేసినప్పటికీ సరైన న్యాయం జరగలేదని తల్లి కన్నీటిపర్యంతమైంది. బాలిక పనిచేసిన సంస్థను నిర్వహించే వ్యక్తి సత్యనారాయణపురంలో ఉండగా పోలీసులకు సమాచారం అందించామని అయినా ఎవరూ స్పందించలేదని స్పష్టం చేశారు. సూర్యాపేటలో ఫిర్యాదు ఇచ్చినా పోలీసులు తమ పరిధి కాదంటూ వెళ్లిపోయారని, ఇప్పటికి ఇన్ని రోజులైనా ఏం న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బాలికను ఉద్యోగం పేరుతో వంచించి తిరుపతికి తీసుకుని వెళ్లి వేధించారని వచ్చిన అభియోగంపై సూర్యాపేట సీఐ అహ్మద్ అలీ స్పందించారు. ఈ విషయం తమ దృష్టికి రాలేదని చెప్పారు. దాని గురించి ఆరా తీస్తామని వెల్లడించారు. నిందితులపై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.