Garbage Tax Abolished in Andhra Pradesh: నగరాలు, పట్టణాల్లో వసూలు చేస్తున్న చెత్త పన్ను నుంచి ప్రజలకు విముక్తి లభించింది. ఈ కొత్త విధానం 2024 డిసెంబరు 31 నుంచి చెత్త పన్ను రద్దు అమల్లోకి వచ్చినట్లుగా పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ శుక్రవారం నోటిఫికేషన్ను జారీ చేసింది. గతంలో చెత్త పన్ను వసూళ్లను నిలిపివేస్తూ 2024 డిసెంబరులో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన మున్సిపల్ చట్ట సవరణను అసెంబ్లీ ఆమోదించింది. దానికి గవర్నర్ అనుమతితో ఇటీవలే గెజిట్ విడుదలైంది.
తాజాగా పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ నోటిఫికేషన్ ఇచ్చింది. చెత్త పన్ను వసూళ్లకు అవకాశం కల్పిస్తూ ఏపీ మున్సిపల్ చట్టం-1965లో చేర్చిన సెక్షన్ 170-బి, మున్సిపల్ కార్పొరేషన్ చట్టం-1955లోని సెక్షన్ 491-ఎ ను తొలగిస్తున్నట్లుగా అందులో ప్రభుత్వం పేర్కొంది. 2021 నవంబర్లో 40 పుర, నగరపాలక సంస్థల్లో ప్రజల వద్ద నుంచి వైఎస్సార్సీపీ ప్రభుత్వం చెత్త పన్నును వసూలు ప్రారంభించింది.
అయితే చెత్త పన్ను ద్వారా దాదాపు రూ.187.02 కోట్ల వరకు వసూలు చేయడం గమనార్హం. ఫలితంగా దీని గురించి అప్పట్లో భారీ ఎత్తున ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడం మనందరికీ తెలిసిందే.
నగరపాలక సంస్థ అధికారుల నిర్లక్ష్యంతో మురికి కూపంలా పెన్నానది